నాగశౌర్య మరో ప్రయోగం... ఈసారి నూతన దర్శకురాలితో ...  

naga shourya doing another experiment with female director - Telugu Lakshmi Sowjanya Move News, Naga Shourya, Naga Shourya Movie News, New Female Director Lakshmi Sowjanya, Tollywod News, Tollywood Latest News

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగుతెరకు హీరోగా పరిచయమయినటువంటి హీరో నాగ శౌర్య గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు.అయితే ఎప్పుడు  కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే టువంటి నాగ శౌర్య గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక పోవడంతో  మంచి హిట్ కోసం పరితపిస్తున్నాడు.

Naga Shourya Doing Another Experiment With Female Director

అయితే ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు నాగశౌర్య.

తాజాగా హీరో నాగ శౌర్య సితార ఎంటర్ టైన్మెంట్  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అంతేగాక ఈ చిత్రం పలువురు సినీ పెద్దల సమక్షంలో ఈ రోజున ప్రారంభమయింది.అయితే ఈ చిత్రానికి నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తోంది.ఈ చిత్రం లో నాగ శౌర్య సరసన పెళ్లి చూపులు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసినటువంటి రీతూ వర్మ నటిస్తోంది. అయితే ఇందులో భాగంగా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ ఈ చిత్రం ఓ లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ జోనర్ లో ఉంటుందని కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు.

అంతేగాక ఈ నెల 19వ తారీకు నుంచి ఈ చిత్ర షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

అయితే తాజాగా హీరో  నాగ శౌర్య నటించిన టువంటి చిత్రం అశ్వథ్థామ.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహించారు.అయితే మహిళలపై జరుగుతున్న టువంటి అకృత్యాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో నాగశౌర్య తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్నాడు.

#Naga Shourya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Naga Shourya Doing Another Experiment With Female Director Related Telugu News,Photos/Pics,Images..