నాగశౌర్య చిత్రాల్లోనే అశ్వద్ధామ టాప్  

Naga Shourya Aswathama Gets Record Trp - Telugu Aswathama, Aswathama Tv Premiere, Naga Shoura, Trp

టాలీవుడ్‌లో యంగ్ హీరో నాగశౌర్య చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.ఊహలు గుసగుసలాడే సినిమాతో సక్సెస్‌ను మొదలుపెట్టిన ఈ హీరో ఛలో సినిమాతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు.

 Naga Shourya Aswathama Gets Record Trp

ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా, ఛలో స్థాయిలో సక్సెస్ మాత్రం రాలేదు.దీంతో తన రీసెంట్ మూవీ ‘అశ్వద్ధామ’పై చాలా నమ్మకం పెట్టుకున్నాడు ఈ హీరో.

పూర్తి యాక్ష థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.

నాగశౌర్య చిత్రాల్లోనే అశ్వద్ధామ టాప్-Gossips-Telugu Tollywood Photo Image

కానీ సినిమా రిజల్ట్ మాత్రం నాగశౌర్య ఆశలను నీరుగార్చింది.

బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా ఫ్లాప్ మూవీగా అశ్వద్ధామ నిలిచింది.ఈ సినిమా కాన్సెప్టు బాగున్నా, ప్రేక్షకులను అలరించడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది.

ఇక ఈ సినిమాను రీసెంట్‌గా టీవీలో ప్రసారం చేసిన విషయం తెలిసిందే.కాగా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్‌లో టీఆర్పీ రేటింగ్స్ రావడంతో అందరూ అవాక్కయ్యారు.జెమినీ టీవీలో ప్రసారమైన అశ్వద్ధామ చిత్రం ఏకంగా 9.10 టీఆర్పీ రేటింగ్ సాధించింది.ఈ టీఆర్పీ నాగశౌర్య గత చిత్రాలతో పోలిస్తే టాప్ అని చెప్పాలి.

రమణతేజ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను నాగశౌర్య హోం బ్యానర్‌పై ఉషా ములుపూరి ప్రొడ్యూస్ చేశారు.

మెహ్రీన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలవడంతో శౌర్య తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.కాగా అశ్వద్ధామ బుల్లితెర ప్రేక్షకులను మెప్పించడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు