పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న నాగ శౌర్య- Naga Shauryas Movie Is Titled Police Vaari Hecharika

Naga Shaurya\'s movie is titled Police Vaari Hecharika, Director Rajendra, Tollywood, Varudu Kavalenu Movie, Lakshya Movie - Telugu Director Rajendra, Lakshya Movie, Naga Shaurya, Police Vaari Hecharika, Tollywood, Varudu Kavalenu Movie

లవర్ బాయ్ పాత్రలతో హీరోగా కెరియర్ ప్రారంభించిన నటుడు నాగ శౌర్య.ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఫస్ట్ సక్సెస్ కొట్టిన శౌర్య ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా హీరోగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.ఎక్కువగా లవర్ బాయ్ తరహా పాత్రలతోనే శౌర్య కనిపిస్తున్నాడు.దీంతో టాలెంటెడ్ హీరో అనే గుర్తింపు ఉన్న కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ కాలేదు.దీంతో తానే సొంతం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి మొదటి సినిమాగా చలో చేశాడు.ఈ సినిమా కమర్షియల్ హిట్ అయ్యి అతనికి మంచి ఇమేజ్ తీసుకొచ్చింది.

 Naga Shauryas Movie Is Titled Police Vaari Hecharika-TeluguStop.com

తరువాత మళ్ళీ రొటీన్ ఫార్ములా కథలతో కమర్షియల్ సినిమాలు చేయడంతో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.అశ్వద్ధామ సినిమాతో నాగ శౌర్య చివరిగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

ఆ సినిమా ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.నాగ శౌర్యకి మంచి పేరు తీసుకొచ్చింది.

 Naga Shauryas Movie Is Titled Police Vaari Hecharika-పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న నాగ శౌర్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటె ఇప్పుడు శౌర్య చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.అందులో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన లక్ష్య సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.దీంతో పాటు ఫీమేల్ డైరెక్టర్ తో వరుడు కావలెను అనే లవ్ స్టోరీ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ఇందులో రీతువర్మతో శౌర్య జతకడుతున్నారు.దీంతో పాటు ఇప్పుడు కెరియర్ మొదటి సరి మోస్ట్ సక్సెస్ ఫుల్ క్యారెక్టరైజేషన్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగ శౌర్య కనిపించబోతున్నాడు.

ఈ సినిమాతో రాజేంద్ర దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది.

దీనికి పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ ఖరారు చేసి పోస్టర్ రిలీజ్ చేశారు.ఇక ఈ సినిమాలో శౌర్య తన కామెడీ టైమింగ్ ని మరోసారి తెరపై చూపించబోతున్నాడు.

ఈ సినిమాతో గ్యారెంటీ తన ఖాతాలో ఒక హిట్ వేసుకుంటాడనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.

#VaruduKavalenu #Naga Shaurya #PoliceVaari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు