సక్సెస్ కోసం పెన్ను పట్టుకున్న యువ హీరో!  

సక్సెస్ కోసం రచయితగా మారిన నాగ శౌర్య.

Naga Shaurya Wrote Story For His Movie-

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా తనకంటూ గుర్తింపు క్రియేట్ చేసుకున్న హీరో నాగ శౌర్య. ఈ యువ హీరో కెరియర్ లో చెప్పుకోదగ్గ పాత్రలె చేసిన సోలో హీరోగా తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నంలో బోల్తా పడుతూనే ఉన్నాడు. చలో సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న శౌర్య వెంటనే నర్తనశాలతో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు..

సక్సెస్ కోసం పెన్ను పట్టుకున్న యువ హీరో!-Naga Shaurya Wrote Story For His Movie

ప్రస్తుతం హే బేబీ సినిమాలో సమంతకి జోడీగా కనిపిస్తున్న ఆ సినిమా క్రెడిట్ మొత్తం సమంతకి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరుకు శౌర్య చేసిన సినిమాలు క్రెడిట్ ఏది కూడా తనకు దగ్గలేదు. దీంతో మళ్ళీ ఎలా అయిన ట్రాక్ ఎక్కి తన స్టామినా నిరూపించుకొని టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరిగా నిలబడాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇక తనకి తాను సక్సెస్ ఇచ్చుకోవడం కోసం ఈ యువ హీరో ఏకంగా రచయితగా మారిపోయాడు. యువ దర్శకులు చెప్పే కథలలో ఏవి తనని మెప్పించాకపోవడంతో తానే ఎందుకు పెన్ను పట్టకూడదు అని డిసైడ్ అయిన నాగ శౌర్య ఏకంగా తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథ తానే రాసుకొని తన ఫ్రెండ్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ సొంత బ్యానర్ లోనే మళ్ళీ సక్సెస్ కొట్టి క్రేజీ హీరోగా మార్కెట్ లో దూసుకెళ్ళాలి అని భావిస్తున్నాడు. మరి హీరో నుంచి నిర్మాతగా మారి, ఇప్పుడు ఏకంగా రచయితగా కూడా మరో అడుగు వేసిన ఈ కుర్ర హీరోకి తాను రాసిన కథ అయిన హిట్ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.