నాగ సౌర్య 'వరుడు కావలెను' షూట్ ను రీస్టార్ట్ చేసిన మేకర్స్ !

ఊహలు గుసగుసలాడే‘ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ సౌర్య.ఆ తర్వాత తన నటనతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Naga Shaurya Varudu Kaavalenu Movie Resumed Shooting-TeluguStop.com

ఇక ఛలో సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రస్తుతం నాగ సౌర్య ‘వరుడు కావలెను’ సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్ లో నాగ సౌర్య తన లుక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

 Naga Shaurya Varudu Kaavalenu Movie Resumed Shooting-నాగ సౌర్య వరుడు కావలెను’ షూట్ ను రీస్టార్ట్ చేసిన మేకర్స్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కరోనా కారణంగా చాలా సినిమాలు మధ్యలోనే వాయిదా పడ్డాయి.

అయితే ఇప్పుడిప్పుడే వాయిదా పడిన సినిమాల షూటింగ్స్ అన్ని మళ్ళీ పునః ప్రారంభం అవుతున్నాయి.తాజాగా నాగ సౌర్య ‘వరుడు కావలెను’ సినిమా కూడా ఈ రోజే మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది.

ఈ విషయంపై అధికారికంగా పోస్టర్ కుడా విడుదల చేసారు.ఈ సినిమా మహిళా డైరెక్టర్ లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఆమెకు ఇది మొదటి సినిమా కావడంతో తన టాలెంట్ ను నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.ఇందులో నాగ సౌర్య కు జోడీగా రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు.ఈ సినిమా టైటిల్ వినగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఇందులో మురళీ శర్మ, నదియా కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Telugu Lakshya Movie, Naga Shaurya, Naga Shaurya Varudu Kaavalenu Movie Resumed Shooting, Ritu Varma, Varudu Kaavalenu Movie-Movie

ఇది ఇలా ఉండగా నాగ సౌర్య హిట్ ప్లాప్ లతో సంభంధం లేకుండా వరసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.నాగ సౌర్య ఈ సినిమాతో పాటు లక్ష్య సినిమా కూడా చేస్తున్నాడు.ఈ సినిమాను సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇందులో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపు కుంటుంది.

దీంతోపాటు పోలీస్ వారి హెచ్చరికతో సినిమా, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా కూడా చేస్తున్నారు.

#VaruduKaavalenu #Ritu Varma #Naga Shaurya #NagaShaurya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు