బాగా పెంచేసిన శౌర్య.. ప్రీలుక్‌లో ఇరగదీశాడు!

యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవల అశ్వద్ధామ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.ఆ సినిమా కమర్షియల్ పరంగా సక్సెస్ కాకపోవడంతో తన నెక్ట్స్ చిత్రాలను పక్కా ప్లాన్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో.

 Naga Shaurya Stunning Pre Look Of New Movie, Naga Sharuya, Ns20, Pre Look, Tolly-TeluguStop.com

కాగా తాజాగా కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్న నాగ శౌర్య, త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని చూస్తున్నాడు.కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

ఈ ప్రీలుక్ పోస్టర్‌లో అదిరిపోయే బాడీ ఫిజిక్‌తో నాగశౌర్య దుమ్ములేపాడు.స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య ఆర్చరీ ఆటగాడిగా కనిపిస్తాడట.తనకు ఎదురైన సమస్యలను అతడు ఎలా అధిగమించి, తాను గురిపెట్టిన విజయాన్ని ఎలా అందుకున్నాడనేది సినిమా కథ అని తెలుస్తోంది.ఈ సినిమా కోసం కండలు తిరిగేలా బాడీని పెంచాడు ఈ హీరో.

లాక్‌డౌన్ సమయం బాగా కలిసిరావడంతో ఈ హీరో తెగ వర్కవుట్స్ చేశాడు.ఇక ఈ సినిమాలో కూడా మనోడు పూర్తి గడ్డంతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.కాగా ఈ సినిమాలో అందాల భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించనుంది.

ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించి సినిమాను అతి త్వరలో ముగించేయాలని చూస్తున్నారు.ఈ సినిమాతో నాగశౌర్య ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 27న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube