మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ జాబితాలో నాగసౌర్య.. అభినందిస్తున్న నెటిజెన్స్!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ సౌర్య ఒకరు.ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

 Naga Shaurya Ranked Fifth In Hyderabad Times Most Desirable Men 2020, Naga Shaur-TeluguStop.com

తాజాగా ఈ సంవత్సరం హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020 జాబితాను ప్రకటించారు.కానీ ఎప్పటిలా కాకుండా ఈసారి ఈ లిస్టులో కొన్ని మార్పులు కనిపించడంతో అందరు ఆశ్చర్య పడుతున్నారు.

ఈ లిస్టులో మొదటి స్థానం తప్ప మిగిలిన స్థానాల్లో మార్పులు కనిపిస్తున్నాయి.మొదటి స్థానంలో ఎప్పటిలాగానే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నిలిచారు.ఈయన గత రెండు సంవత్సరాలుగా మొదటి స్థానంలో ఉంటున్నాడు.అందుకే పెద్దగా ఎవ్వరు ఆశ్చర్య పడడం లేదు.

కానీ ఈ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ లిస్టులో ఈసారి టాలీవుడ్ యంగ్ హీరో పేరు నిలవడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.

Telugu Hyderabad Times, Desirable, Naga Shaurya, Nagashaurya-Movie

మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020 జాబితాలో యంగ్ హీరో నాగ సౌర్య ఐదవ స్థానంలో నిలిచాడు.ఈ విషయం విని అందరు సర్ప్రైజ్ అయ్యారు.గత సంవత్సరం లిస్టులో కూడా చోటు దక్కించుకోలేని నాగ సౌర్య ఇప్పుడు ఏకంగా ఐదవ స్థానములో రావడంతో నెటిజన్స్ ఒకింత సర్ప్రైజ్ అవుతున్నారనే చెప్పాలి.

నాగ సౌర్య బాడీ మేకోవర్ తో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసాడనే చెప్పాలి.

Telugu Hyderabad Times, Desirable, Naga Shaurya, Nagashaurya-Movie

సిక్స్ ప్యాక్ తో అభిమానులతో పటు ఇండస్ట్రీ లో కూడా అందరి చూపులు ఇతనిపై పడ్డాయి.అంతేకాదు వరుసగా సినిమాలు ప్రకటించి ఫ్యాన్స్ కు వరుస ట్రీట్స్ కూడా అందించాడు.మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020 జాబితాలో స్టార్ హీరోలను సైతం పక్కకు నెట్టి ఐదవ స్థానం అందుకోవడంతో నెటిజెన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అతడిని అభినందిస్తున్నారు.

ఈ జాబితాలో ఎన్టీఆర్ మూడవ స్థానంలో నిలిచారు.ప్రస్తుతం సౌర్య చేసే లక్ష్య, వరుడు కావలెను సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube