'ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి' టీజర్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు.ఈయన ఫ్యామిలీ కథాంశంతో సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.

 Naga Shaurya Phalana Abbayi Phalana Ammayi Teaser To Drop On This Date Details,-TeluguStop.com

ఒక్కో సినిమాకు నటనలో తన టాలెంట్ కనబరుస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించు కున్నాడు.ఇక నాగ శౌర్య ఛలో సినిమాతో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

ఇప్పుడు నాగ శౌర్యకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

ఈ మధ్యనే కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత నాగ శౌర్య క్రేజీ లైనప్ సెట్ చేసుకున్నాడు.ఈ లైనప్ లో ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నాడు.ప్రెజెంట్ నాగ శౌర్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఫలానా అబ్బాయి.ఫలానా అమ్మాయి.

ఈ సినిమా ఎప్పటి నుండి సెట్స్ మీద ఉంది.

కానీ ఇంకా ఇంత వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.మరి ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ ఒక అప్డేట్ అందించారు.నాగ శౌర్య హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాను డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించాడు.

శ్రీనివాస్ అవసరాల సినిమాలు అంటే మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటాయి.అందుకే ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టీజర్ అప్డేట్ అందించారు మేకర్స్.సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఎప్పుడో ప్రకటించారు.ఫిబ్రవరి 9న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.చిన్న వీడియోను రిలీజ్ చేస్తూ ఈ విషయం తెలిపారు.మరి ఈ ప్రేమ కథను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించగా కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube