సోషల్ మీడియా వేదికగా మరో సినిమాను అనౌన్స్ చేసిన నాగశౌర్య…!  

Hero Naga Shourya Officially Announced Next Movie, Naga Shourya, Ira Prouctions, Instagram, Social media,Naga Shourya Next Movie - Telugu Hero Naga Shourya Officially Announced Next Movie, Instagram, Ira Prouctions, Naga Shourya, Naga Shourya Next Movie, Social Media

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న హీరో నాగ శౌర్య.సినిమా బ్యాక్ గ్రౌండ్ కుటుంబం నుంచి వచ్చిన ఆయన పలు వైద్య సినిమాలోనే ఎంచుకుంటూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు.

TeluguStop.com - Naga Shaurya Officially Confirmed Next Movie

తాజాగా నాగ శౌర్య మరో కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు.కొత్త ప్రాజెక్టులతో నాగసౌర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై జాగర్లమూడి సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటిస్తున్నాడు నాగశౌర్య.ఈ సినిమా మొత్తం స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఇది ఇలా ఉండగా లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో కూడా మరో సినిమాను చేస్తున్నాడు నాగసౌర్య.

TeluguStop.com - సోషల్ మీడియా వేదికగా మరో సినిమాను అనౌన్స్ చేసిన నాగశౌర్య…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

2011 సంవత్సరంలో తన నటన కెరియర్ ని టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదలుపెట్టి నాగశౌర్య పలు సినిమాలు చేస్తూ సినిమా హిట్, ప్లాప్ అని తేడా లేకుండా కొత్త తరహా సినిమాలలో నటిస్తూ నాగశౌర్య ముందుకు వెళ్తున్నాడు.ఇక అసలు విషయంలోకి వెళితే.తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు.ఇందులో భాగంగానే ” లవర్ “, ” అలా ఎలా ” చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిష్ కృష్ణతో నాగశౌర్య మరో సినిమా చేయబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించాడు.ఇకపోతే, ఈ సినిమా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నట్లు అర్థమవుతోంది.

ఇందుకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ ని నాగ శౌర్య విడుదల చేశారు.

నాగ శౌర్య నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

నాగశౌర్య సొంత బ్యానర్ అయిన ఐర క్రియేషన్స్ లో నాలుగో సినిమాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.ఈ సినిమాకు గాను బుజ్జి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నారు.

అలాగే ఇదివరకు నాగ శౌర్య నటించిన ఛలో సినిమాకు సంగీతాన్ని అందించిన సాగర్ మహతి ఈ సినిమాకు మరో సారి సంగీతాన్ని అందించబోతున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా అతి త్వరలోనే మొదలు అవుతున్నట్లు సమాచారం.

ఇక ప్రస్తుతానికి మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత, దర్శకుడు లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపిన నాగశౌర్య అతి త్వరలోనే సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారన్న విషయాలను తెలపబోతున్నారు.

#Ira Prouctions #Naga Shourya #Instagram #HeroNaga #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Naga Shaurya Officially Confirmed Next Movie Related Telugu News,Photos/Pics,Images..