నాగ శౌర్య సినిమాకు క్లాప్ కొట్టిన స్టార్ డైరెక్టర్..!  

Naga Shaurya-Aneesh Krishna Film Launched, Koratala Siva, Hyderabad , Production no. 4, Mahati Swara Sagar, Ira Creations - Telugu @anilravipudi, @iamrohithnara, @ira_creations, @mulpurishankar, @sivakoratala, @vamsi84, @yemyenes, Ira Creations, Production No. 4, Usha Mulpuri

టాలీవుడ్ హీరో నాగ శౌర్య కొత్తగా చేస్తున్న సినిమా షూటింగ్ మొదలైంది.ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 4 శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉష మల్పూరి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది.

TeluguStop.com - Naga Shaurya New Movie Launched Koratala Siva

ఈ సినిమా ముహూర్త సన్నివేశానికి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ కొట్టగా నందమూరి హీరో నారా రోహిత్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు.ఈ సినిమాకు అనిష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

వీరితో పాటు మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు.

TeluguStop.com - నాగ శౌర్య సినిమాకు క్లాప్ కొట్టిన స్టార్ డైరెక్టర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ స్క్రిప్ట్ ను దర్శకుడికి అందజేశాడు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఓ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సినిమా గురించి ఇటీవలే హీరో నాగ శౌర్య సోషల్ మీడియా వేదికగా కన్ఫామ్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే.

ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు.అందుకు తగ్గట్టుగానే ఈ చిత్ర షూటింగ్ తాజాగా మొదలైంది.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది.

నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో నాలుగో సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బుజ్జి అండ్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

నాగ శౌర్య నటించిన ఛలో సినిమా కు సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన సాగర్ మహతి ఈ చిత్రానికి కూడా సంగీతం అందించబోతున్నారు.ఈ సినిమా నాగ శౌర్య తన కెరీర్లో 22 వ సినిమాగా తెరకెక్కబోతోంది.

ఈ చిత్రం పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించబోతున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాలో నటించబోయే నటీనటులకు సంబంధించి పూర్తి వివరాలు అతి త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.

ఈ యంగ్ హీరో తన సొంత బ్యానర్ లోనే సినిమాలను తీయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు.

#@MulpuriShankar #@AnilRavipudi #@iamrohithnara #Usha Mulpuri #@YEMYENES

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Naga Shaurya New Movie Launched Koratala Siva Related Telugu News,Photos/Pics,Images..