డిసెంబర్ 10న వస్తున్న నాగశౌర్య లక్ష్య..!

Naga Shaurya Laqshya Release Date

యువ హీరో నాగ శౌర్య లీడ్ రోల్ లో కెతిక శర్మ ఫీమేల్ లీడ్ గా వస్తున్న సినిమా లక్ష్య.సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏసియన్ సినిమాస్ బ్యానర్ లో నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మారర్ నిర్మిస్తున్నారు.

 Naga Shaurya Laqshya Release Date-TeluguStop.com

పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 10న రిలీజ్ ఫిక్స్ చేశారు.నాగ శౌర్య ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని తెలిసిందే.

సినిమాలో నాగ శౌర్య లుక్స్, స్టైల్ అదిరిపోతాయని తెలుస్తుంది.రోమాంటిక్ సినిమాతో అలరించిన కెతిక శర్మ కూడా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.

 Naga Shaurya Laqshya Release Date-డిసెంబర్ 10న వస్తున్న నాగశౌర్య లక్ష్య..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్నాళ్లుగా రిలీజ్ కన్ ఫ్యూజన్ లో ఉన్న ఈ సినిమాను డిసెంబర్ 10న రిలీజ్ ఫిక్స్ చేశారు.డిసెంబర్ 17న పుష్ప సినిమా వస్తుండగా వారం ముందే లక్ష్య ప్రేక్షకుల ముందుకు రానుంది.

లక్ష్య సినిమా కోసం నాగ శౌర్య చాలా హోం వర్క్ చేశాడు.సినిమాలో నాగ శౌర్య సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపించనున్నాడు.

సినిమాకు కాళ భైరవ మ్యూజిక్ అందిస్తున్నారు.రీసెంట్ గా వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ శౌర్య లక్ష్యతో మరోసారి వారిని మెప్పించాలని చూస్తున్నాడు.

#LaqshyaNaga #Naga Shaurya #Kethika Sharma #Laqshya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube