లక్ష్య టీజర్‌తో విజయంపై గురిపెట్టిన నాగశౌర్య- Naga Shaurya Lakshya Teaser Impressive

Naga Shaurya Lakshya Teaser Impressive, Naga Shaurya, Lakshya, Teaser, Jagapathi Babu, Tollywood News - Telugu Jagapathi Babu, Lakshya, Naga Shaurya, Teaser, Tollywood News

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు.ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘లక్ష్య’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిందని చెప్పాలి.

 Naga Shaurya Lakshya Teaser Impressive-TeluguStop.com

ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని, ఈ సినిమా టైటిల్ వరకు ప్రేక్షకులను మెప్పించడంలో లక్ష్య చిత్రం విజయం సాధించింది.ఇక షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా విజయం సాధించేందుకు రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా నాగశౌర్య పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు.ఈ టీజర్ చూస్తుంటే శౌర్య, ఖచ్చితంగా హిట్ కొట్టేలా ఉన్నట్లు కనిపిస్తుంది.

 Naga Shaurya Lakshya Teaser Impressive-లక్ష్య టీజర్‌తో విజయంపై గురిపెట్టిన నాగశౌర్య-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో శౌర్య ఆర్చరీ ఆటగాడిగా కనిపిస్తున్నాడు.అల్ట్రా స్టైలిష్ లుక్‌లోనే కాకుండా సిక్స్ ప్యాక్ బాడీతో శౌర్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

పార్థు అనే పాత్రలో శౌర్య నటిస్తుండగా, అతడి ఓటమి నుండి తిరిగి విజయాన్ని ఎలా అందుకున్నాడు, అతడు మిగతా ఆటగాళ్లకు స్పూర్తిదాయకంగా ఎలా మారాడు అనేది ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

ఇక ఈ టీజర్‌కు జగపతి బాబు వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి.

ఈ సినిమాలో విలన్‌గా జగపతి బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాలో నాగశౌర్య సరసన అందాల భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

సంతోష్ జాగర్లమూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా నారాయణ్ దాస్ నారంగ్, రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూ్స్ చేస్తున్నారు.మరి లక్ష్య చిత్రంతో హీరో నాగశౌర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

#Naga Shaurya #Lakshya #Teaser #Jagapathi Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు