టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు.ప్రస్తుతం నాగ శౌర్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ దూసుకు పోతున్నాడు.లుక్ పరంగా కూడా నాగ సౌర్య అదుర్స్ అనిపిస్తున్నాడు.
ప్రెసెంట్ ఈయన చేస్తున్న సినిమాల్లో ‘లక్ష్య’ సినిమా ఒకటి.విలు విద్య నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసాయి.
ఈ సినిమాలో నాగ సౌర్య కు జంటగా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఆర్చరీ నేపథ్యంలో మొట్టమొదటి సినిమాగా లక్ష్య సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.
సౌర్య ఇందులో పార్థు అనే క్రీడాకారుడు రోల్ లో నటిస్తున్నాడు.
ఈ సినిమా కోసం ఇప్పటికే లుక్ మొత్తం మార్చేశాడు సౌర్య.ఈ సినిమా ఈ నెల 10న విడుదల అవుతున్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేసారు చిత్ర యూనిట్.ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
నిన్న విడుదల అయినా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ట్రైలర్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
యూట్యూబ్ లో ఈ ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతుంది.
ఇప్పటికే యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు భారీ స్పందన రావడంతో 2 మిలియన్ వ్యూస్ రాబట్టింది.ఇంకా 1 లక్ష లైక్స్ కూడా వచ్చాయి.ఇంకా ఈ ట్రైలర్ స్పీడ్ ఏ మాత్రం తగ్గకుండా యూట్యూబ్ లో దుమ్ము లేపుతుంది.
మీరు ఇంకా లక్ష్య ట్రైలర్ చూడకపోతే ఒక్కసారి లుక్కేయండి.