నాగశౌర్య ఫస్ట్ లుక్‌ను ఓ రేంజ్‌లో ఏసుకుంటున్న నెటిజన్లు  

Naga Shaurya First Look Poster Gets Trolled, Naga Shaurya, NS20, First Look, Philipp Plein - Telugu First Look, Naga Shaurya, Ns20, Philipp Plein

యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.శౌర్య కెరీర్‌లో 20వ చిత్రంగా ఈ సినిమా వస్తుండటంతో దీనిపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Naga Shaurya First Look Poster Gets Trolled

ఇక ఈ సినిమాలో నాగశౌర్య సరికొత్త అవతారంలో మనకు కనిపించనున్నాడు.ఈ సినిమాలో ఆర్చరీ ఆటగాడిగా శౌర్య నటిస్తున్నాడు.

కాగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

నాగశౌర్య ఫస్ట్ లుక్‌ను ఓ రేంజ్‌లో ఏసుకుంటున్న నెటిజన్లు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ పోస్టర్‌లో నాగశౌర్య అదిరిపోయే సిక్స్ ప్యాక్ బాడీతో మనకు కనిపించాడు.

పూర్తి ఫిట్‌గా ఉన్న బాడీతో చాలా రఫ్‌లుక్‌లో నాగశౌర్య కనిపించడంతో ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.అయితే ఈ పోస్టర్‌లో నాగశౌర్య అండర్‌వేర్ కంపెనీ పేరు స్పష్టంగా కనిపించడంతో ఈ పోస్టర్‌ను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

ఫిలిప్ ప్లీయిన్ అనే బ్రాండ్ అండర్‌వేర్‌ను అందరికీ కనిపించేలా హీరో వేసుకోవడం ఏమిటని వారు మండిపడుతున్నారు.

ఈ బ్రాండ్ అండర్‌వేర్ రూ.11 వేలు ఉంటుందని, అంత కాస్ట్‌లీ అండర్‌వేర్ వేసుకుంటాడా ఈ హీరో అని అనిపించుకునేందుకు చిత్ర యూనిట్ ఈ తరహా పబ్లిసిటీ స్టంట్ చేస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఏదేమైనా ఎడిటింగ్ టీమ్ వాళ్ల నిర్లక్ష్యం వల్లే శౌర్య అండర్‌వేర్ కనిపిస్తోందని మరికొందరు అంటున్నారు.

మొత్తానికి నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీతో ఎంత రచ్చ చేస్తున్నాడనేది పక్కనబెడితే, అండర్‌వేర్‌తో రచ్చ చేస్తున్నాడనేది మాత్రం నిజం.

#Naga Shaurya #NS20 #First Look #Philipp Plein

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Naga Shaurya First Look Poster Gets Trolled Related Telugu News,Photos/Pics,Images..