ఫ్లాప్ లు ఉన్న నాలుగు కోట్లు కావాలంటున్న యంగ్ హీరో

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యువ హీరోలు అందరూ కూడా రెగ్యులర్ జోనర్ ని పక్కన పెట్టి తమకంటూ ప్రత్యేకత ఉండే విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో ముందుకి వెళ్తున్నారు.ఈ జర్నీలో చాలా మంది యంగ్ హీరోలు సక్సెస్ అవుతున్నారు.

 Naga Shaurya Demands Rs 4 Cr Remuneration, Tollywood, Lakshya Movie,  Varudu Ka-TeluguStop.com

కమర్షియల్ సినిమాలు చేసి స్టార్ హీరో అనే బ్రాండ్ తెచ్చుకోవాలని కంటే కంటెంట్ బేస్ కథలతో సినిమాలు చేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు.అయితే కొంత మంది హీరోలు కంటెంట్ బేస్ కథలు చేసి ఐడెంటిటీ కోసం కమర్షియల్ కథల వైపు వచ్చే వారు ఉన్నారు.

అలాంటి వారిలో నాగ శౌర్య కూడా ఒకరు.కెరియర్ ఆరంభం నుంచి కంటెంట్ బేస్ కథలతో సినిమాలు చేసి సక్సెస్ అయిన ఈ యువ హీరో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ చూపించలేకపోయాడు.

సక్సెస్ రేట్ బాగానే ఉన్న సోలో హీరోగా తనకంటూ సొంత మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోయాడు.

ఈ నేపధ్యంలో తన తల్లిని నిర్మాతగా మార్చి సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి చలో అనే సినిమాతో కమర్షియల్ సక్సెస్ కొట్టాడు.

అయితే స్టొరీ సెలక్షన్ లో లోపాల కారణంగా తరువాత చేసిన సినిమాలు అనుకున్న స్థాయిలో రీచ్ కాలేదు.చివరిగా సొంత ప్రొడక్షన్ లోనే అశ్వద్దామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

ఈ సినిమా పర్వాలేదనే టాక్ సొంతం చేసుకుంది.ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో లక్ష్య అనే సినిమా చేశాడు.

ఇందులో ఎనిమిది పలకల దేహంతో మాస్ హీరో రేంజ్ లో అతని లుక్ ఉంది.ఈ సినిమా మీద గట్టి హోప్స్ నాగ శౌర్య పెట్టుకున్నాడు.

ఇక ప్రస్తుతం అతని చేతిలో ఓ నాలుగు సినిమాల వరకు ఉన్నాయి.సక్సెస్ లేకపోయినా కెరియర్ కి మాత్రం డోకా లేదు.

అయితే ఉన్నపళంగా ఈ హీరో తన రెమ్యునరేషన్ ని నాలుగు కోట్లకి పెంచేసినట్లు తెలుస్తుంది.అంత మొత్తం ఇస్తేనే సినిమా చేస్తానని తెగేసి చెప్పినట్లు టాక్ నడుస్తుంది.

అయితే ఇప్పటికే కమిట్ మెంట్ అయ్యి ఉండటంతో ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ అయ్యారని బోగట్టా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube