హిట్టొచ్చినా ప్లాప్ వచ్చినా నేను చేసే పని అదే.. నాగశౌర్య కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి.ఈ సినిమాకు అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించారు.

 Naga Shaurya About His Movie Result , Naga Shaurya , Tollywood ,krishna Vrinda Vihari ,anil Ravipudi , Anish R Krishna,krishna Vrinda Vihari Pre Release Event-TeluguStop.com

ఐరా క్రియేషన్స్ పతాకం పై నిర్మాత ఉషా మాల్పూరి ఈ సినిమాను నిర్మించారు.ఇందులో నాగశౌర్య సరసన షిర్లీ సెటియా హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు చిత్ర బృందం.

 Naga Shaurya About His Movie Result , Naga Shaurya , Tollywood ,Krishna Vrinda Vihari ,Anil Ravipudi , Anish R Krishna,Krishna Vrinda Vihari Pre Release Event-హిట్టొచ్చినా ప్లాప్ వచ్చినా నేను చేసే పని అదే.. నాగశౌర్య కామెంట్స్ వైరల్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇక ఈ ఈవెంట్ లో భాగంగా హీరో నాగ శౌర్య మాట్లాడుతూ.

ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది.అందుకే నేను ధైర్యంగా పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి నిలబడ్డాను.ఇక ఈ సినిమా విడుదల అయ్యి హిట్ అయినా ఫ్లాప్ అయినా ఫలితం ఏదైనా సరే ప్రేక్షకులు ఇచ్చిన తీర్పును శిరస్సు వంచి తీసుకుంటాను అని చెప్పుకొచ్చారు నాగ శౌర్య.ఈ సినిమా పూర్తి అవ్వడానికి రెండున్నర ఏళ్ల సమయం పట్టింది.

కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమాకు చాలా సమస్యలు తలెత్తాయి అని అని తెలిపారు నాగశౌర్య.అలాగే ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా ఈ సినిమాకి నిర్మాతలు అయినా మా అమ్మనాన్న నా కోసం, సినిమా యూనిట్ కోసం చాలా ధైర్యంగా నిలబడి మంచి డేట్స్ కోసం ఎదురుచూసి సినిమాని ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Telugu Anil Ravipudi, Anish Krishna, Krishnavrinda, Naga Shaurya, Tollywood-Latest News - Telugu

ఇలాంటి అమ్మనాన్నలు దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పుకొచ్చాడు నాగేశౌర్య అనంతరం దర్శకుడు అనీష్‌ కృష్ణ గురించి మాట్లాడుతూ మంచి మనసున్న దర్శకుడు అంటూ కొనియాడారు.ఆయన చాలా మంచి కథ చెప్పారు.ఎంత మంచి కథ చెప్పారో అంతే అద్భుతంగా ఈ సినిమాని తీశారు.నాకు మంచి సినిమా ఇవ్వబోతున్నారనే నమ్మకం వుంది.అలాగే సినిమాలో ఒక కీలకమైన సన్నివేశం వుంది.సినిమా లైఫ్‌ని నిర్ణయించే సన్నివేశం అది.ఆ ఒక్క సీన్ లక్ష్మీ భూపాల‌గారు అద్భుతంగా రాశారు.అని తెలిపాడు నాగశౌర్య.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube