Naga Chaitanya Custody Movie: NC22 టైటిల్ అనౌన్స్.. 'కస్టడీ'తో రాబోతున్న చైతూ!

అక్కినేని సెకండ్ తరం వారసుడిగా నాగ చైతన్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.మరి ఈ యంగ్ హీరో ఈ రోజు పుట్టిన రోజును జరుపు కుంటున్నారు.

 Naga Chaitanyas Next Gets A Crazy Title-TeluguStop.com

దీంతో అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా ఈయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇక ఈయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

ఇటీవలే థాంక్యూ వంటి ప్లాప్ తో డీలా పడిపోయిన చైతూ వెంటనే నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసాడు.ప్రెజెంట్ తమిళ్ డైరెక్టర్ తో చైతూ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

వెంకట్ ప్రభు తో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసాడు.విభిన్న చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ తమిళ్ డైరెక్టర్ కు చైతూ అవకాశం ఇచ్చాడు.

NC22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు.నిన్ననే ప్రీ లుక్ రోలీజ్ చేసి మంచి బజ్ క్రియేట్ చేసి టైటిల్ అనౌన్స్ మెంట్ పై మరింత ఆసక్తి కలిగించారు.

ఇక ఈ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ టైటిల్ కూడా అనౌన్స్ చేసారు.ఈ సినిమాకు ”కస్టడీ” అనే ఆసక్తికర టైటిల్ ను పెడుతున్నట్టు పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు.ఈ పోస్టర్ లో చైతూ పోలీస్ గెటప్ లో ఇంటెన్స్ లుక్ తో కనిపిస్తున్నాడు.అతడి చుట్టూ పోలీసులు గన్స్ తో అతడిని చుట్టుముట్టారు.ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇందులో మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటించ బోతుంది.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube