జోష్ సినిమాతో సినిమాల్లోకి దశాబ్దం క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య హీరోగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను సినిమాసినిమాకు ఎంచుకుంటున్నారు.కెరీర్ మొదట్లో చైతన్య నటించిన మాస్ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో నాగచైతన్య ఎక్కువగా క్లాస్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్నారు.
చైతన్య గత సినిమాలు మజిలీ, వెంకీమామ బాక్సాఫీస్ దగ్గర హిట్లయ్యాయి.
ప్రస్తుతం నాగ చైతన్య లవ్ స్టోరీ, థ్యాంక్యూ సినిమాలలో నటిస్తున్నారు.
లవ్ స్టోరీ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుండగా థ్యాంక్యూ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానున్నాయి.మనం సినిమా తరువాత నాగచైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమాలో చైతన్య లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

నాగచైతన్య ఈ ఫోటోలో పిల్లాడిలా కనిపిస్తూ ఉండటం గమనార్హం.34 సంవత్సరాల వయస్సులో నాగచైతన్య థ్యాంక్యూ సినిమా కోసం 17 సంవత్సరాల పిల్లాడిలా మారిపోయారు.గతంలో ప్రేమమ్ సినిమాలో కూడా నాగచైతన్య యంగ్ గా కొన్ని నిమిషాల పాటు కనిపించిన సంగతి తెలిసిందే.
థ్యాంక్యూ మూవీలో పిల్లాడి లుక్ లో చైతన్య ఎంత సమయం కనిపిస్తాడో చూడాల్సి ఉంది.
ఈ మధ్య కాలంలో విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో విక్రమ్ ఈ సినిమాతో మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.
రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుండగా దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని తెలుస్తోంది.