అమీర్ ఖాన్ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్న నాగ చైతన్య

కరోనా సెకండ్ వేవ్ కారణంగా టాలీవుడ్, బాలీవుడ్ లో హీరోలు అందరూ చాలా వరకు షూటింగ్ లు బంద్ చేసి చేసి ఇంటివ్పట్టునే ఉన్నారు.పెద్ద పెద్ద సినిమాలు కూడా ఆగిపోయాయి.

 Naga Chaitanya Will Join Aamir Khan Movie Shooting-TeluguStop.com

కరోనా సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో అనవసరమైన రిస్క్ ఎందుకని హీరోలతో పాటు దర్శక, నిర్మాతలు జాగ్రత్తలు పడ్డారు.అయితే కొంత మంది మాత్రం తప్పనిసరి పరిస్థితిలో షూటింగ్ క్యాన్సిల్ చేస్తే సినిమా కోసం వేసిన కోట్ల రూపాయిల సెట్స్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని షూటింగ్ చేస్తున్నారు.

నాని శ్యామ్ సింగరాయ్ షూటింగ్ ఈ కారణంగానే ప్రస్తుతం జరుగుతుంది.అలాగే రజినీకాంత్ అన్నాత్తై షూటింగ్ కూడా జరుగుతుంది.

 Naga Chaitanya Will Join Aamir Khan Movie Shooting-అమీర్ ఖాన్ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్న నాగ చైతన్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే హీరో నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్ కోసం కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడానికంటే ముందుగానే ఇటలీ వెళ్ళిపోయారు.

ప్రస్తుతం అక్కడ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఇటలీలో షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత థాంక్యూ కి కొంత గ్యాప్ ఇచ్చి అమీర్ ఖాన్ హీరోగా హిందీలో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ కోసం ఆ టీమ్ తో జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తుంది.లాల్ సింగ్ షూటింగ్ షెడ్యూల్ ని హిమాచల్ ప్రదేశ్ లో అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతం అయిన లడక్ లో 45 రోజుల పాటు ప్లాన్ చేశారు.

త్వరలో ఇక్కడ చిత్రీకరణ మొదలవుతుంది.ఈ సినిమాలో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో చైతూ కూడా ఈ షెడ్యూల్ కోసం లాల్ సింగ్ టీమ్ తో జాయిన్ కాబోతున్నాడు.విజయ్ సేతుపతి పోషించాల్సిన పాత్రలో నాగ చైతన్యకి లాల్ సింగ్ కోసం ఎంపిక చేశారు.

ఈ నేపధ్యంలో థాంక్యూ సినిమా షూటింగ్ ముగించుకొని ఆ సినిమా కోసం చైతన్య నెక్స్ట్ ప్రయాణం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

#Naga Chaitanya #AamirKhan #LaalSingh #Thank You Movie #Akkineni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు