నాన్నతో తమ్ముడు కాదు నేను అంటూ ట్విస్ట్‌ ఇచ్చిన నాగచైతన్య... ఆ వార్తలన్నీ పుల్కా వార్తలేనా?  

Naga Chaitanya To Work With Nagarjuna In Bangarraju-bangarraju,naga Chaitanya,nagarjuna

నాగార్జున ప్రస్తుతం ‘మన్మధుడు 2’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రం పూర్తి కాకుండానే సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలోని బంగార్రాజు పాత్రను తీసుకుని, దాని నేపథ్యంలో ఒక కథతో ‘బంగార్రాజు’ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు. సినిమాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కళ్యాణ్‌ కృష్ణ ఇప్పటికే సినిమాకు కథను సిద్దం చేయడంతో పాటు, నటీనటుల ఎంపిక కూడా చేస్తున్నాడు. రెండు మూడు నెలల్లో సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది..

నాన్నతో తమ్ముడు కాదు నేను అంటూ ట్విస్ట్‌ ఇచ్చిన నాగచైతన్య... ఆ వార్తలన్నీ పుల్కా వార్తలేనా?-Naga Chaitanya To Work With Nagarjuna In Bangarraju

ఈ సమయంలోనే ఈ చిత్రంలో నాగచైతన్య, అఖిల్‌లు నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

కొన్ని రోజుల క్రితం స్వయంగా నాగచైతన్య మాట్లాడుతూ బంగార్రాజులో తాను ఉండబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆ తర్వాత అఖిల్‌ వార్తల్లోకి వచ్చాడు.

అఖిల్‌ కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు, తండ్రితో పాటు అన్నదమ్ములు ఇద్దరు కూడా సినిమాలో ఉంటారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అఖిల్‌ మాత్రమే కనిపించబోతున్నాడు, నాగార్జునకు మనవడి పాత్రలో అఖిల్‌ అయితేనే బాగుంటుందని అంతా భావించారు. అయితే తాజాగా మరోసారి నాగచైతన్య క్లారిటీ ఇచ్చాడు.

నాగచైతన్య స్థానంలో అఖిల్‌ నటించబోతున్నాడు, బంగార్రాజు చిత్రంలో నాగచైతన్య ఉండడు అంటూ మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది. మజిలీ సూపర్‌ హిట్‌ నేపథ్యంలో నాగచైతన్య మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు చిత్రాల గురించి స్పందిస్తూ తాను నాన్నతో బంగార్రాజు చిత్రంలో నటించబోతున్నట్లుగా ప్రకటించాడు. బంగార్రాజు చిత్రంలో అఖిల్‌ నటించడు, నేను నటించబోతున్నాను అంటూ చైతూ చేసిన ప్రకటనతో మళ్లీ చిత్ర వర్గాల్లో మరియు మీడియాలో సినిమా గురించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రంను త్వరలోనే ప్రారంభించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని నాగార్జున కోరిక.