నాగ చైతన్యతో జత కట్టబోతున్న ప్రియాంక ఆరుళ్ మోహన్

నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మలయాళీ ముద్దుగుమ్మ ప్రియాంక ఆరుళ్ మోహన్.ఈ అమ్మడుకి మొదటి సినిమా పెద్దగా కలిసి రాకపోయిన రెండో సినిమా శ్రీకారం రూపంలో మరో అవకాశం దొరికింది.ఈ సినిమాలో ఆమె పాత్రకి మంచి మార్కులే పడ్డాయి.దీని తర్వాత తెలుగులో వెంటనే అవకాశాలు రాకున్న తమిళంలో మాత్రం ఏకంగా మూడు సినిమాలు పట్టేసింది.అందులో సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కూడా ఉండటం విశేషం.ఇదిలా ఉంటే విక్రమ్ కె కుమార్ నాగ చైతన్య కాంబోలో తెరకెక్కుతున్న థాంక్యూ మూవీలో ఈమెని మెయిన్ హీరోయిన్ గా తీసుకుంటారని అప్పట్లో టాక్ వచ్చింది.

 Naga Chaitanya To Romance With Priyanka Arul Mohan, Tollywood, Thank You Movie,-TeluguStop.com

అయితే ఎందుకనో ఆ అవకాశం రాశీఖన్నాకి పోయింది.ఇక సెకండ్ హీరోయిన్ గా మాళవిక నాయర్ ఫైనల్ అయిపొయింది.

దీంతో చేతి వరకు వచ్చిన అవకాశాన్ని ఈ బ్యూటీ వదులుకున్నట్లు అయ్యింది.ఇదిలా ఉంటే ఇప్పుడు మాత్రం నాగ చైతన్య కొత్త సినిమాలో ప్రియాంకాకి అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.

చైతూ నెక్స్ట్ మూవీని ఓ కొత్త దర్శకుడుతో రొమాంటిక్ లవ్ స్టొరీ కథతో చేస్తున్నాడని తెలుస్తుంది.ఇది హోం బ్యానర్ లోనే తెరకేక్కుతుందని టాక్.

ఈ మూవీ కోసం ప్రియాంక ఆరుళ్ మోహన్ ని హీరోయిన్ గా ఖరారు చేసారని సమాచారం.ఇక ఈ దర్శకుడు, ఇతర వివరాలు లాక్ డౌన్ తర్వాత అఫీషియల్ గా బయటకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

అయితే బంగార్రాజు సినిమాలోనే ప్రియాంక చైతూకి జోడీగా కనిపిస్తుందనే టాక్ కూడా బయట వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube