నాగచైతన్య హార్రర్ వెబ్ సిరీస్ కి అంత సిద్ధం.. హీరోయిన్ ఎవరంటే?

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనేశేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి జంటగా నటించిన టువంటి “లవ్ స్టోరీ” సినిమా ఈనెల 24వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.

 Naga Chaitanya To Act In A Horror Web Series-TeluguStop.com

ఈ క్రమంలోనే నాగచైతన్య ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎంతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు ట్రైలర్ ప్రేక్షకులకు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఇదే కాకుండా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో “థాంక్యూ” సినిమా తెరకెక్కుతోంది.

 Naga Chaitanya To Act In A Horror Web Series-నాగచైతన్య హార్రర్ వెబ్ సిరీస్ కి అంత సిద్ధం.. హీరోయిన్ ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే నాగచైతన్య బాలీవుడ్ లో “లాల్ సింగ్ చ‌ద్ధా” లో కూడా సందడి చేయబోతున్నాడు.

ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.ఇదిలాఉండగా నాగార్జునతో కలిసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ చిత్రంగా “బంగార్రాజు” తెరకెక్కుతోంది.

ఇదిలా ఉండగా నాగచైతన్య ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడనీ గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే విక్రమ్ నాగచైతన్య కాంబినేషన్ లో వెబ్ సిరీస్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు.

ఈ సిరీస్ ను హారర్ జోనర్ లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.ఈ సిరీస్ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభించబోతున్నారు.

ఇలా ఈ సిరీస్ షూటింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

Telugu Amazon Prime, Bangarraju, Director Vikram K Kumar, Heroine, Horror Web Series, Love Story, Manam, Naga Chaitanya, Nagachaitanya Web Series, Thank You, Tollywood, Vikram-Movie

ఇందులో నాగచైతన్య సరసన నటించడం కోసం హీరోయిన్ వేటలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే నాగచైతన్య విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో వచ్చిన మనం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.అదేవిధంగా వీరిద్దరి కాంబోలో థాంక్యూ సినిమా తెరకెక్కబోతోంది.ఇక తాజాగా నాగచైతన్య డెబ్యూ వెబ్ సిరీస్ లోనే రావడంతో ఈ సిరీస్ పై అంచనాలు కూడా పెరుగుతున్నాయి.

మరి నాగచైతన్య తన డెబ్యూ సిరీస్ ద్వారా ఏ విధమైనటువంటి గుర్తింపును సంపాదించుకుంటాడో వేచి చూడాల్సి ఉంది.

#Bangarraju #Vikram #Love Story #Horror Web #Manam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు