ప్రయోగానికి సిద్దమైన చైతు.. బెడిసికొడుతుందేమో?

యువ సామ్రాట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ క్రమంలోనే నాగ చైతన్య విక్రమ్ కె.

 Nagachaitanya To Act As Villain In Web Series With Director Vikram K Kumar, Nag-TeluguStop.com

కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న నాగ చైతన్య ఇదివరకు ఎప్పుడూ చేయని సరికొత్త ప్రయోగానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

సినిమా ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగచైతన్య త్వరలోనే విలన్ పాత్రలో సందడి చేయబోతున్నట్లు సమాచారం.ఎన్నో రోజుల నుంచి నాగచైతన్య వెబ్ సిరీస్ లో నటించాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలోనే నాగచైతన్య ఓ వెబ్ సిరీస్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.అయితే ఇందులో హీరో పాత్రలో కాకుండా చైతు విలన్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

Telugu Bangarraju, Love Story, Naga Chaitanya, Nagachaitanya, Tollywood, Villan,

చైతన్య చేస్తున్నటువంటి ఈ సరికొత్త ప్రయోగం అతనికి సత్ఫలితాలను ఇస్తుందో లేక తీవ్ర నిరాశ పరుస్తుందో వేచిచూడాలి.ఈ వెబ్ సిరీస్ కథను దర్శకుడు చైతూకు వినిపించగానే చైతన్య ఏ మాత్రం ఆలోచించకుండా ఇందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.మరి విలన్ పాత్రలో చైతు అందరిని మెప్పిస్తాడో లేదో వేచి చూడాలి.ఇకపోతే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ చిత్రంగా తెరకెక్కుతున్నటువంటి బంగార్రాజు చిత్రంలో కూడా నాగ చైతన్య నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube