థ్యాంక్యూ టీజర్‌ టాక్‌... చైతూ మళ్లీ మూడు వేరియేషన్స్‌

నాగ చైతన్య హీరోగా మనం దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వం లో రూపొందిన థ్యాంక్యూ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన థ్యాంక్యూ సినిమా జులై లో రాబోతున్న నేపథ్యం లో సినిమా సందడి షురూ చేశారు.

 Naga Chaitanya Thank You Movie Teaser , Avika Gor, Flim News, Naga Chaitanya, Rashi Kanna, Thank You-TeluguStop.com

ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ మరియు మూవీ లవర్స్ కోసం అన్నట్లుగా థ్యాంక్యూ టీజర్ ను విడుదల చేశారు.థ్యాంక్యూ టీజర్ తో సినిమా పై ఒక క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమా లో నాగ చైతన్య మూడు ఏజ్ గ్రూప్ ల్లో కనిపించబోతున్నాడు.ఆ మూడు ఏజ్‌ గ్రూప్ లకు చెందిన లుక్స్ ను టీజర్ లో చూపించారు.

ఇదే సమయంలో నాగ చైతన్య గతంలో నటించిన ప్రేమమ్‌ సినిమా ను కూడా టీజర్ లో గుర్తు చేశాడు.

ప్రేమమ్ సినిమా లో మూడు ఏజ్ గ్రూప్ ల వేరియేషన్స్ తో కనిపించాడు.

ఇప్పుడు థ్యాంక్యూ కూడా అదే పరిస్థితి అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.మొత్తానికి థ్యాంక్యూ సినిమా టీజర్ తో ఏదో మ్యాటర్ అయితే ఉంది అన్నట్లుగా చెప్పకనే చెప్పింది.

మూడు పాత్రలకు సంబంధించి ఏమాత్రం క్లారిటీ ఇవ్వక పోగా అసలు సినిమా లో ఏం ఉంటుంది అనే విషయాన్ని చెప్పకుండానే చెప్పాడు.మొత్తానికి నాగ చైతన్య మరియు రాశిఖన్నాల మద్య రొమాంటిక్ సన్నివేశాలు ఉండటంతో పాటు అవికా గౌర్‌ మరియు మాళవిక నాయర్ లు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా విక్రమ్‌ కే సినిమా లు ఉంటాయి.అదే తరహా లో థ్యాంక్యూ సినిమా కూడా ఉంటుందని అంతా నమ్మకం వ్యక్తం అవుతుంది.

ఈ సినిమా లో నాగ చైతన్య పాత్ర వేరియేషన్స్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube