వైరల్ : నాగచైతన్య థాంక్యూ స్టోరీ లైన్ లీక్.. !

అక్కినేని కుటుంబం నుండి వచ్చినా తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించుకున్నాడు నాగ చైతన్య.ఈ మధ్య నాగ చైతన్య విభిన్న కథలను ఎంచుకుంటూ తన విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.

 Naga Chaitanya Thank You Movie Story Leaked-TeluguStop.com

మజిలీ సినిమా హిట్ అయిన తర్వాత నాగ చైతన్య శేఖర్ కమ్ములతో ‘లవ్ స్టోరీ’ సినిమా స్టార్ట్ చేసాడు.ఈ సినిమాలో నాచ్యురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా నుండి వచ్చిన సాంగ్, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శేఖర్ కమ్ముల ఈ సినిమాను లవ్ అండ్ ఎమోషనల్ అంశాలతో తెరకెక్కిస్తున్నాడు.

 Naga Chaitanya Thank You Movie Story Leaked-వైరల్ : నాగచైతన్య థాంక్యూ స్టోరీ లైన్ లీక్.. -Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా ఏప్రిల్ 16 న విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.మళ్ళీ కరోనా తగ్గుముఖం పడితేకాని విడుదల అయ్యే అవకాశం లేదు.

అయితే ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకు ‘థాంక్యూ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను విక్రమ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది.అయితే తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాతో విక్రమ్ మరొకసారి ఫ్యామిలీ సబ్జెక్టు తో రాబోతున్నాడట.ఎన్నారై బిజినెస్ మాన్ అయినా హీరో తనది ఇండియా అని తెలుసుకుని తన కుటుంబ సభ్యులను వెతికే జర్నీ నే ఈ సినిమా స్టోరీ లైన్ అంటూ వార్తలు వస్తున్నాయి.

#Vikram K Kumar #NagaChaitanya #Naga Chaitanya #Thank You Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు