సమంతపై చైతన్య ప్రేమకు ఈ టాటూనే సాక్ష్యం.. ఇబ్బంది లేదంటూనే?

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.కాగా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని దాదాపు పది నెలలు పూర్తి అవుతున్న కూడా వీళ్ళిద్దరికీ సంబంధించిన వార్త ఏదో ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

 Naga Chaitanya About Ex Wife Samantha Ruth Prabhu And Tattoo,naga Chaitanya,sama-TeluguStop.com

గశామంతా లేదా నాగచైతన్య ఏదో ఒక ఇంటర్వ్యూకి హాజరు కావడం అక్కడ వారి విడాకులకు సంబంధించిన విషయాల గురించి అడగడం, వెంటనే స్పందించడం ఇలా ఏదో ఒక విషయంపై తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
నేపథ్యంలోనే నాగచైతన్య నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నాగచైతన్య కూడా కీలకపాత్రలో నటించాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.కాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న నాగచైతన్య విడాకుల గురించి, సమంతా గురించి, తన చేతిపై ఉన్న టాటూలు గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య తన చేతి పై ఉన్న టాటూ గురించి స్పందించాడు.

Telugu Divorce, Naga Chaitanya, Nagachaitanya, Samantha, Tollywood-Movie

ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.సమంతతో పెళ్లి జరిగిన తేదీని కూడా నా చేతిపై టాటూను వేయించుకున్నాను.అది డేట్ అని తెలియక నా అభిమానులు ఆ పచ్చబొట్టుని కాపీ కొడుతున్నారు.

దయచేసి టాటూ విషయంలో నన్ను ఫాలో అవ్వద్దు.అలాగే నాకు ఈ టాటూ చేతి పై ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు.

అందువల్లే సమంతతో విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత కూడా ఆ టాటూ ని తొలగించలేదు అని చెప్పుకొచ్చాడు నాగచైతన్య.సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా టాటూ విషయంలో నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube