చైతూకి సినిమాల తర్వాత ఏదంటే ఎక్కువ ఇష్టమో తెలుసా?

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రెసెంట్ సూపర్ హిట్ సినిమాలతో దూసుకు పోతున్నాడు.ఈయన కెరీర్ వరుస హిట్లు కారణంగా ఊపందుకుంది.

 Naga Chaitanya Taking About His Love On Cars And Bikes Details, Naga Chaitanya,-TeluguStop.com

ఈయన కెరీర్ మొదట్లో కాస్త తడబడిన ఆ తర్వాత మంచి మంచి సినిమాలు చేస్తూ విభిన్న పాత్రలతో అలరిస్తున్నాడు.ఇటీవలే సంక్రాంతి కానుకగా బంగార్రాజు సినిమాతో మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

చైతూ చూడడానికి సాఫ్ట్ గా కనిపిస్తాడు కానీ ఆయన బైక్ లను, కార్ లను చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ కనిపిస్తాడు.ఈయనకు బైక్ లన్న కార్ లన్న చాలా ఇష్టం.

సినిమాల్లోకి వచ్చాక రేసర్ గా తన వేగాన్ని చాలా తగ్గించాడు కానీ వాటిపై ఇష్టాన్ని మాత్రం పూర్తిగా వదులుకోలేదు.ఈయన కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ఖరీదైన బైక్ లను, కార్ లను అస్సలు వదిలి పెట్టాడు.

ఆయనకీ సినిమాల్లోనూ బైక్ లకు, కార్ లకు సంబంధించిన సీన్లలో నటించడం చాలా ఇష్టం అని ఎప్పుడు చైతు చెప్తూ ఉంటాడు.గతంలో కూడా చైతు ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసి మరి ఆయనకు నచ్చిన విధంగా రీ మోడల్ చేయించుకున్నట్టు సమాచారం.

తాజాగా ఇంటర్వ్యూ లో చైతన్యను దీని గురించి అడగగా.చైతు ఈ విషయంపై మాట్లాడారు.

Telugu Bangarraju, Cars, Naga Chaitanya, Nagarjuna, Raashi Khanna, Thankyou, Vik

ఒకసారి నా బర్త్ డే కి నాన్న ఒక కారును గిఫ్ట్ గా ఇచ్చారు.ఆ కారును నాకు నచ్చినట్టుగా మార్చుకున్నాను.జపాన్ నుండి కొన్ని పార్ట్శ్ తెప్పించి నాకు కావలసినట్టు ఆ కారును రీ మోడల్ చేయించు కున్నాను.కార్లు, బైక్ లు.ఆ ప్రపంచం అంటే నాకు చాలా ఇష్టం.సినిమాల తర్వాత నేను ఎక్కువుగా ఇష్టపడేది వాటినే.

నాకు ఏ మాత్రం తీరిక దొరికిన కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన బైకులను, కార్లను గురించి స్టడీ చేయడం అలవాటు.అంటూ చెప్పుకొచ్చాడు.

Telugu Bangarraju, Cars, Naga Chaitanya, Nagarjuna, Raashi Khanna, Thankyou, Vik

ఇక చైతూ సినిమాల విషయానికి వస్తే ఈయన లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube