విడాకుల తర్వాత ప్రేమపై మొదటిసారి చైతూ కామెంట్స్.. నెట్టింట్లో వైరల్!

టాలీవుడ్ హీరో నాగచైతన్య తాజాగా థాంక్యూ మూవీలోని ఫేర్వెల్ పాటను రిలీజ్ చేయడానికి చిత్ర బృందంతో కలసి మల్లారెడ్డి కాలేజ్ కి వెళ్లారు.సాంగ్ విడుదల చేసిన తర్వాత హీరో నాగచైతన్య మాట్లాడుతూ.

 Naga Chaitanya Superb Speech On College Life At Farewell Song Launch From Thank You Movie Naga Chaitanya, Thank You Movie, Tollywood, Rashikhanna, Vikran Kumar-TeluguStop.com

తన కాలేజీ డేస్ ని గుర్తు చేర్చుకున్నారు.అమ్మాయిలు అందరూ అందంగా కనిపిస్తున్నారు.

అబ్బాయిలు బాగున్నారా.బాగా చదువుకుంటున్నారా? అందరూ అల్లరి చేస్తున్నారా? ఇలా కాలేజీలో ఈవెంట్ కు వచ్చిన ప్రతిసారి కూడా నేను జలసీగా ఫీలవుతూ ఉంటాను ఎందుకంటే ఆ రోజు నాకు కాలేజీ లైఫ్ గుర్తుకు వస్తుంది అని తెలిపారు నాగ చైతన్య.

 Naga Chaitanya Superb Speech On College Life At Farewell Song Launch From Thank You Movie Naga Chaitanya, Thank You Movie, Tollywood, Rashikhanna, Vikran Kumar-విడాకుల తర్వాత ప్రేమపై మొదటిసారి చైతూ కామెంట్స్.. నెట్టింట్లో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాలేజీ లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు కాలేజీ అయిపోయిందా అని అనుకునేవాడిని.జీవితం ఎప్పుడు మొదలు పెట్టాలి నా లైఫ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇంట్లో నా లవ్ స్టోరీ ఎప్పుడు చెప్పాలి.

ఇలాంటి ఆలోచనలు నా మైండ్ లో రన్ అవుతూ ఉండేవి కానీ ఇప్పుడు చెబుతున్నాను.మీ జీవితంలో కాలేజీ డేస్ బెస్ట్ డేస్ ఒక్కసారి కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదంతా కూడా రేస్ లా ఉంటుంది.

ఎన్నో సవాళ్లను,ఒత్తిళ్లను అధిగమించాల్సి ఉంటుంది అని తెలిపారు నాగచైతన్య.అదేవిధంగా కాలేజీలో చేరితే నేర్చుకుంటాము జీవితాంతం అదే గుర్తు ఉంటుంది.

అదే జీవితాంతం మనతో ఉంటుంది.లెక్చరర్స్ ఇప్పుడు ఏం నేర్పిస్తారో ఇప్పుడు అర్థం కాదు కానీ పదేళ్ల తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు లెక్చరర్స్ చెప్పిన మాటలు మీకు కచ్చితంగా గుర్తుకు వస్తాయి.కాబట్టి కాలేజీలో ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయండి మెమోరీస్ ని కూడగట్టుకోండి అని సలహా మాత్రమే నేను మీకు ఇవ్వగలను అని తెలిపారు నాగ చైతన్య.అనంతరం మాట్లాడుతూ నా టీం అందరికీ థాంక్స్.ఎంతో బాగా సపోర్ట్ చేశారు.ఈ సినిమా కోసం మేము మూడేళ్లు కష్టపడ్డాము.

ఈ చిత్రం మీ కోసమే చూసి అందరూ ఎంజాయ్ చేయండి అని చెప్పుకొచ్చారు నాగచైతన్య.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube