అక్కినేని హీరో నాగచైతన్య గత ఏడాదిలో మంచి సక్సెస్‌లను దక్కించుకున్నాడు.ఇక ఈ ఏడాది ఏకంగా హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.
ప్రస్తుతం లవ్ స్టోరీ చిత్రాన్ని చేస్తున్నాడు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.
ఆ వెంటనే పరుశురామ్ దర్శకత్వంలో నాగేశ్వరరావు అనే సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు.అన్ని ఓకే అయితే సమ్మర్‌లో ఆ సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ రెండు సినిమాలతో పాటు తాజాగా మరో సినిమాను కూడా చైతూ ఒప్పుకున్నాడు.దిల్‌రాజు బ్యానర్‌లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు.ఈ మూడు సినిమాలు కూడా నాగచైతన్య కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించే విధంగా ఉంటాయని సినీ వర్గాల వారు అంటున్నారు.వరుణ్ తేజ్‌కు ఫిదాలా ఈ చిత్రంతో నాగచైతన్యకు సక్సెస్ దక్కుతుందని, స్టార్‌డం దక్కుతుందని అంతా నమ్మకంగా ఉన్నారు.

మొత్తానికి హ్యాట్రిక్ కోసం ఈ ఏడాదిలో మూడు సినిమాలు కమిట్ అయిన నాగచైతన్య అంత సులభంగా హ్యాట్రిక్ కొట్టేనా చూడాలి.ఈ ఏడాది మూడు విడుదల అయితే రెండు సినిమాలు సక్సెస్ అయినా చాలా గొప్పవిషమే.అదే మూడు సినిమాలు కూడా భారీ విజయాన్ని దక్కించుకుంటే తప్పకుండా కెరీర్‌లో చాలా ముందడుగు వేసినట్లే అంటూ టాక్ వినిపిస్తుంది.మరి చైతూకు 2020 ఎలా కలిసి వస్తుందో చూడాలి.