విజయ్ ప్లేస్ లో నాగ చైతన్య..!

నిన్ను కోరి, మజిలీ సినిమాలతో తీసిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న డైరక్టర్ శివ నిర్వాణ తన థర్డ్ మూవీ టక్ జగదీష్ తో మాత్రం టార్గెట్ మిస్ అయ్యాడని చెప్పొచ్చు.నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేదు.

 Naga Chaitanya Replaced For Vijay Devarakonda Shiva Nirvana Movie-TeluguStop.com

సినిమా థియేటర్లలో రాలేదు కాబట్టి లాస్, ప్రాఫిట్ ల గురించి తెలియదు.ఒకవేళ వచ్చి ఉంటే మాత్రం కచ్చితంగా లాస్ వచ్చేది.

అమేజాన్ ప్రైం లో టక్ జగదీష్ రిలీజ్ కాగా ఆ సినిమా చూసి ప్రేక్షకులు పెదవి విరిచారు.

 Naga Chaitanya Replaced For Vijay Devarakonda Shiva Nirvana Movie-విజయ్ ప్లేస్ లో నాగ చైతన్య..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక టక్ జగదీష్ తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేశాడు శివ నిర్వాణ.

అయితే టక్ జగదీష్ రిజల్ట్ చూసిన రౌడీ హీరో ఈ సినిమా నుండి తప్పుకున్నాడని తెలుస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు బదులుగా నాగ చైతన్య రిప్లేస్ అయ్యాడని టాక్.

ఆల్రెడీ శివ నిర్వాణతో మజిలీ సినిమా చేసిన చైతు మరోసారి అతనితో సినిమాకు సిద్ధమవుతున్నాడు.వరుస క్రేజీ ప్రాజెక్టులతో నాగ చైతన్య దూసుకెళ్తున్నాడని చెప్పొచ్చు.

  లవ్ స్టోరీ రిలీజ్ కు రెడీ అవగా విక్రం కుమార్ డైరక్షన్ లో థ్యాంక్ యు సినిమా సెట్స్ మీద ఉంది.శివ నిర్వాణ డైరక్షన్ లో సినిమా కూడా త్వరలో ఎనౌన్స్ మెంట్ వస్తుందని టాక్.

#Nani #Naga Chaitanya #NagaChaitanya #Shiva Nirvana #Tuck Jagadish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు