పెళ్లిచూపులు డైరెక్టర్‌తో అక్కినేని బుల్లోడు

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్‌స్టోరి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీ ‘థ్యాంక్ యు’ను పట్టాలెక్కిస్తున్నాడు ఈ అక్కినేని హీరో.

 Naga Chaitanya Next Movie With Tharun Bhascker, Naga Chaitanya, Tharun Bhascker,-TeluguStop.com

కాగా ఈ సినిమాలతో వరుస విజయాలను అందుకోవాలని చైతూ చూస్తున్నాడు.కాగా ఈ రెండు సినిమాలు రిలీజ్ కాకముందే మరో డైరెక్టర్‌తో ఓ క్రేజీ సినిమా చేసేందుకు చైతూ రెడీ అయ్యాడు.

పెళ్లిచూపులు లాంటి సినిమాతో తన సత్తా చాటిన యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు.ఎప్పటినుండో ఓ స్క్రిప్టును రెడీ చేసిన తరుణ్ భాస్కర్, ఆ కథను విక్టరీ వెంకటేష్‌తో చేయాలని చూశాడు.

కానీ కొన్ని కారణాల వల్ల వెంకీతో తరుణ్ భాస్కర్ సినిమా సెట్ కాకపోవడంతో, ఇప్పుడు ఆ స్క్రిప్టును అక్కినేని నాగచైతన్యతో చేసేందుకు తరుణ్ భాస్కర్ ప్లాన్ చేస్తున్నాడు.ఈ క్రమంలో చైతూకి తన కథను వినిపించాడట ఈ డైరెక్టర్.

అయితే చైతూ ఈ సినిమాపై తన నిర్ణయాన్ని ఇంకా తెలుపలేదట.

మరి తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు చైతూ ఒప్పుకుంటాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న చైతూ, త్వరలో రాబోతున్న లవ్‌స్టోరి, థ్యాంక్ యు చిత్రాలతో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి అంటున్నారు ఆయన అభిమానులు.ఈ రెండు సినిమాలు కూడా వేర్వేరు కథలతో వస్తుండటంతో చైతూ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి.

అటు తరుణ్ భాస్కర్ చైతూ కోసం ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడో తెలియాలంటే ఈ సినిమా పట్టాలెక్కే వరకు ఆగాల్సిందే.ఈ కాంబో సెట్ అయితే ఆ సినిమా బక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube