నాగేశ్వరరావుగా నాగ చైతన్య! పేరు మార్చేస్తున్న దర్శకుడు

అక్కినేని నాగార్జున నట వారసుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య కెరియర్ ఆరంభంలో మాస్ ఎలిమెంట్స్ తో నడిచే కమర్షియల్ కథలు చేశాడు.అయితే ఆ తరహా సినిమాలు తనకి సెట్ కాలేదని ఫిక్స్ అయిన తర్వాత తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథలతోనే ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.

 Naga Chaitanya Next Movie Name Title As A Nageswara Rao-TeluguStop.com

మధ్యలో అప్పుడప్పుడు కాస్తా కమర్షియల్ హీరో టచ్ ఇస్తున్నాడు.ఇదిలా ఉంటే మజిలీ, వెంకిమామ సినిమాలతో చైతు మంచి జోష్ మీద ఉన్నాడు.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత చైతూ గీతాగోవిందం సినిమాతో క్రేజీ దర్శకుడుగా మారిపోయిన పరశురాంతో సినిమా ప్లాన్ చేశాడు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగిపోయినట్లు తెలుస్తుంది.ఇక ఇది కూడా పరశురాం తనకి అలవాటైన రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్ లోనే తీస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దర్శకుడు ఆసక్తికరమైన టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.మనం సినిమాలో చైతు క్యారెక్టర్ పేరు నాగేశ్వరరావు.ఇప్పుడు అదే పేరుని ఈ సినిమాకి పెట్టాడని తెలుస్తుంది.ఈ పేరు పెట్టడం వలన చైతూ తాతని గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది.

అదే సమయంలో కొత్తగా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో పరశురాం చెప్పగానే ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.అన్ని అనుకూలంగా జరిగితే ఏప్రిల్ లో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube