చైతన్య నెక్స్ట్ సినిమా డైరక్టర్ ఎవరంటే..?

అక్కినేని హీరో నాగ చైతన్య ఈ పొంగల్ కి బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.సోగ్గాడే చిన్ని నాయనా  సీక్వేల్ గా వస్తున్న బంగార్రాజు  సినిమాలో నాగ చైతన్య తన స్వాగ్ కొనసాగించేలా ఉన్నాడు.

 Naga Chaitanya Next Movie Director Fix, Naga Chaitanya , Parasuram , Tollywood,-TeluguStop.com

అసలే వరుస హిట్లతో దూసుకెళ్తున్న నాగ చైతన్య బంగార్రాజుతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత విక్రం కుమార్ డైరక్షన్ లో థ్యాంక్ యు సినిమా చేస్తున్నాడు చైతన్య.

ఆ సినిమా దాదాపు ముగింపు దశకు చేరుకుంది.ఇక ఆ సినిమా తర్వాత నాగ చైతన్య సర్కారు వారి పాట డైరక్టర్ పరశురాం తో సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు టాక్.

గీతా గోవిందం తర్వాత అసలైతే నాగ చైతన్య తో సినిమా చేయాలని అనుకున్నాడు పరశురాం.కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడ్డది.

ఇక ఇప్పుడు మహేష్ సినిమా తర్వాత ఎలాగు పరశురాం క్రేజీ డైరక్టర్ అవుతాడని అంచనా వేస్తూ నాగ చైతన్యతో అతనితో మూవీ ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది.పరశురాం తో చైతన్య ఈ కాంబో క్రేజీగా రాబోతుంది.

వరుస క్రేజీ సినిమాలతో నాగ చైతన్య తన ఫాం కొనసాగిస్తున్నారు.సర్కారు వారి పాట సెన్సేషనల్ హిట్ అయితే పరశురాం తో చైతు చేసే సినిమా కూడా ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పరచనుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube