లవ్ స్టోరిలో ఆ ట్యాలెంట్ బయటపెడుతున్న చైతూ  

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో లవ్ స్టోరి చిత్రాన్ని రిలీజ్‌కురెడీ చేశాడు.

TeluguStop.com - Naga Chaitanya New Talent In Love Story Movie

కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.అయితే లవ్ స్టోరి చిత్రంలో చైతూ పర్ఫార్మెన్స్ అదిరిపోయే రేంజ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను పూర్తి యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు.

TeluguStop.com - లవ్ స్టోరిలో ఆ ట్యాలెంట్ బయటపెడుతున్న చైతూ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాలో చైతూ తనలోని ఓ కొత్త ట్యాలెంట్‌ను బయటపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో చైతూ జుంబా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడట.కథలో భాగంగా ఈ జుంబా డ్యాన్స్‌ను తనదైన పద్దతిలో ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా ప్రెజెంట్ చేసేందుకు ప్రత్యేకంగా ట్రెయినింగ్ కూడా తీసుకుంటున్నాడు చైతూ.

తెలంగాణలోని ఓ పల్లెటూరి అబ్బాయి తన కలలను నెరవేర్చుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చి ఎలాంటి కష్టాలు పడ్డాడు అనే పాత్రలో చైతూ ఒదిగిపోయినట్లు ఈ చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

చైతూలోని కొత్త ట్యాలెంట్ చూసి ఆయన ఫ్యాన్స్ అవాక్కవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో చైతూ సరసన అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.

శేఖర్ కమ్ముల తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించగా, ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.మరి ఈ సినిమాలో చైతూ కొత్త ట్యాలెంట్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.

#Love Story #Naga Chaitanya #Sai Pallavi #Zumba Dance

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు