అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ప్రస్తుతం చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దగా ఉంది.గత ఏడాది విడుదల అవ్వాల్సిన లవ్ స్టోరీ సినిమా ను కరోనా కారణంగా వాయిదా వేశారు.
ఎట్టకేలకు సినిమాను విడుదల చేస్తున్నారు.వచ్చే నెల 10 న లవ్ స్టోరీ ని విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.
లవ్ స్టోరీ తర్వాత చైతూ థ్యాంక్యూ సినిమాను చేశాడు.తమిళ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన థ్యాంక్యూ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.
భారీ అంచనాలున్న ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కూడా ముగిసింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు.
థ్యాంక్యూ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ఇలా వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ ఉన్న నాగచైతన్య త్వరలో ఒక ప్రయోగాత్మక సినిమా ను చేసేందుకు సిద్దం అయ్యాడు.
విశ్వ సనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాంది సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు విజయ్ కనక మేడల దర్శకత్వం లో ఒక ప్రయోగాత్మక సందేశాత్మక సినిమాను చేసేందుకు గాను చైతూ ఓకే చెప్పాడు.అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా రూపొందబోతున్న బంగా ర్రాజు సినిమా లో చైతూ కీలక పాత్రలో నటించబోతున్నాడు.అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి.ఇక బంగార్రాజు సినిమా తర్వాత విజయ్ కనక మేడల దర్శకత్వం లో సినిమా ను చైతూ మొదలు పెడతాడని అంటున్నారు.లాల్ సింగ్ చద్దా సినిమా తో బాలీవుడ్ లో చైతూ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.
ఆ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కాబోతుంది.