నాగచైతన్య మూవీకి రూ.50 కోట్లు.. వాళ్లకు ఝలక్..?

యంగ్ హీరో నాగచైతన్య దశాబ్దం క్రితం జోష్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.చైతన్య కెరీర్ లో ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నా నాగచైతన్య సినిమాలేవీ 50 కోట్ల కలెక్షన్లు అందుకోలేదు.

 Naga Chaitanya Love Story Movie Theatrical Business Details,viral,latest Tollywo-TeluguStop.com

అయితే లవ్ స్టోరీ సినిమా మాత్రం థియేట్రికల్ హక్కులతోనే 50 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నట్టు తెలుస్తోంది.రిలీజ్ కు ముందే ఈ సినిమా నిర్మాతలకు కోట్ల రూపాయల లాభాన్ని అందిస్తోందని సమాచారం.

లవ్ స్టోరీ సినిమా ఆంధ్రా హక్కులు 15 కోట్ల రూపాయలకు అమ్ముడవగా 6 కోట్ల రూపాయలకు ఓవర్సీస్ హక్కులు అమ్ముడైనట్లు తెలుస్తోంది.నైజాం ఏరియా నుంచి ఈ మూవీకి భారీ ఆఫర్లు వస్తున్నా అక్కడ మాత్రం ఈ సినిమాను నిర్మాతలు సొంతంగా విడుదల చేసుకుంటున్నారు.

సీడెడ్, ఇతర ఏరియాల హక్కులతో కలిపితే లవ్ స్టోరీ థియేట్రికల్ హక్కుల ద్వారా 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Telugu Crore Rupees, Love Story, Nagachaitanya, Pre-Movie

నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా బిజినెస్ తో పోటీగా ఉన్న ఇతర హీరోలకు ఝలక్ ఇచ్చాడనే చెప్పాలి.ఫిదా సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే విడుదలైన పాటలు కూడా హిట్ కావడంతో ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సాయిపల్లవి శేఖర్ కమ్ముల కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ కావడంతో అంచనాలను అందని స్థాయిలో లవ్ స్టోరీ బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది.ఏప్రిల్ 16వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube