'లవ్‌ స్టోరీ' విషయంలో ఆ రెండు పుకార్లకు క్లారిటీ వచ్చేసింది

నాగచైతన్య హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వం లో రూపొందిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.గత ఏడాది నుండి అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తున్నారు.

 Naga Chaitanya Love Story Movie Release Date , Flim News, Love Story, Love Story-TeluguStop.com

ఫిదా సినిమా విడుదల అయ్యి నాలుగు అయిదు సంవత్సరాలు అవుతుంది.శేఖర్ కమ్ముల సినిమా కోసం వెయిట్‌ చేస్తున్న అభిమానులు ఎప్పటికి ఆయన సినిమా చూస్తామా అంటూ ఎదురు చూశారు.

ఎట్టకేలకు ఈ సినిమాను విడుదల అవుతుందని అనుకుంటున్న సమయంలో మళ్లీ వాయిదా వేశారు.ఈ సినిమా ను సెప్టెంబర్‌ లో విడుదల చేస్తారని అంతా అనుకున్నారు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.కాని తాజాగా సినిమా విడుదల తేదీని మార్చినట్లుగా టాక్ వచ్చింది.

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్‌ మూడవ వారం లో లేదా నాల్గవ వారంలో అయినా విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

Telugu Love Story, Lovestory, Naga Chaitanya, Shekhar Kammula-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా విడుదల వాయిదాకు ప్రధాన కారణం ఆ రోజున విడుదల అవుతున్న సినిమాలు అంటూ సమాచారం అందుతోంది.దర్శకుడు శేఖర్‌ కమ్ముల తో పాటు అందరు యూనిట్‌ సభ్యులు చర్చించుకుని సినిమా ను పోటీ గా ఉన్న సమయంలో విడుదల చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యానికి వస్తున్నాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విడుదల తేదీ ప్రకటన కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఉన్నారు.సినిమా షూటింగ్‌ ముగిసి ఏడాది అయ్యింది.అయినా కూడా విడుదలకు మాత్రం స్పష్టత లేదు.పోటీ లేకుండా ఉన్న సమయంలో సోలో రిలీజ్ కు ప్రయత్నాలు చేస్తున్న మేకర్స్‌ సెప్టెంబర్ చివర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube