హిందీ హార్రర్ రీమేక్ చిత్రంలో నాగచైతన్య ....క్లారిటీ ఇచ్చిన టీమ్!

అక్కినేని నాగచైతన్య(Nagachaitanya) ఇటీవల కస్టడీ సినిమా(Custody Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.డైరెక్టర్ వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Naga Chaitanya In The Hindi Horror Remake Details, Naga Chaitanya, Tabu, Bhool B-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయినప్పటికీ పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయిందని చెప్పాలి.ఈ విధంగా కస్టడీ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో నాగచైతన్య తన తదుపరి సినిమా గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనేఈయన హిందీ హర్రర్ మూవీ అయినటువంటి భూల్‌ భులయ్యా 2 (Bhool Bhulaiyaa 2) సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Bhool Bholaiya, Jyothika, Naga Chaitanya, Nagachaitanya, Tabu, Venkat Pra

కార్తీక్‌ ఆర్యన్‌(Karthik Aryan), కియారా అద్వానీ (Kiara Advani) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో టబు(Tabu) కూడా కీలక పాత్రలో నటించారు.ఇలా హిందీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమాని నాగచైతన్య తెలుగులో చేయబోతున్నారని ఇక టబు పాత్రలో ప్రముఖ నటి జ్యోతిక(Jyothika) నటించబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలపై నాగచైతన్య టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

నాగచైతన్య హిందీ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.ఇక ఆయన తదుపరి సినిమాని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.

Telugu Bhool Bholaiya, Jyothika, Naga Chaitanya, Nagachaitanya, Tabu, Venkat Pra

ఇకపోతే నాగచైతన్య కస్టడీ సినిమా తర్వాత తన తదుపరిచిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్లు(Geetha Arts Banner) చేయబోతున్నారని ఈ చిత్రానికి డైరెక్టర్ చందు మొండేటి(Chandu Mondeti) దర్శకత్వం వహించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా గుజరాత్ కి చెందిన ఒక మస్యకారుడి జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube