అరెరే.. దేవరకొండ రిజెక్ట్ చేసిన కథను చైతూ చేస్తున్నాడా.. ఇదెక్కడి ట్విస్టు?

సాధారణంగా కొందరు రచయితలు దర్శకులు ఒక హీరోను దృష్టిలో ఉంచుకొని ఒక కథను సిద్ధం చేసుకుంటారు.ఆ కథ ఫలానా హీరోకైతే కరెక్ట్ గా సరిపోతుందని భావించి ఈ కథను సిద్ధం చేసుకున్న తర్వాత ఆ హీరోకు కథను వినిపిస్తే కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి.

 Nagachaitanya Green Signal To Vijay Devarakonda Rejected Movie Story, Naga Chai-TeluguStop.com

ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు ఆ ప్రాజెక్టును మరొక హీరో వద్దకు తీసుకు వెళ్తారు.ఇలా ఎన్నో సినిమాలకు ముందుగా ఒక హీరోను అనుకుని తరువాత మరొక హీరో తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు.

తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ విషయంలో కూడా ఇదే జరిగింది.విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్థాయిలో సినిమాల్లో నటిస్తుండడం చేత అతను ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఓ సినిమాను తెరకెక్కించాలని విజయ్ దేవరకొండ నటించిన మహానటి సినిమా సమయంలోనే అతనితో ఒక డీల్ కుదుర్చుకున్నారు.

అయితే కొన్ని కారణాల వల్ల విజయ్ దేవరకొండ మరొకరికి కమిట్మెంట్ ఇవ్వడంతో ఈ సినిమాను చేసే అవకాశం కోల్పోయారు.

Telugu Bangarraju, Naga Chaitanya, Stroy, Tollywood-Movie

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ అక్కినేని నాగచైతన్య వరకు వెళ్ళింది.కథ మొత్తం విన్న నాగచైతన్య ఏ మాత్రం సందేహం లేకుండా ఈ సినిమాకి ఓకే చెప్పారు.అలా విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న సినిమాలో నాగ చైతన్య నటిస్తున్నారు.

ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం థాంక్యూ, బంగార్రాజు వంటి చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.అలాగే బాలీవుడ్ లో నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చద్ద విడుదలకు సిద్ధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube