సామ్‌ అలా చేస్తుందనుకోవడం లేదు.. చైతూ క్లారిటీ   Naga Chaitanya Gives Clarity On About Samantha Continue In Film     2018-07-10   03:25:50  IST  Raghu V

అక్కినేని వారి ఇంటి కోడలు సమంత సినిమాలకు దూరం కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. గత కొన్ని నెలలుగా సమంత ఏ ఒక్క చిత్రానికి కమిట్‌ కాలేదు. తెలుగు మరియు తమిళంకు చెందిన పలువురు నిర్మాతలు ఈమెను సంప్రదించారు. కాని ఈమె మాత్రం ఏ ఒక్క చిత్రానికి కమిట్‌ కాలేదు. తమిళంలో ఒక ప్రముఖ హీరో సరసన నటించే అవకాశం దక్కినప్పటికి ఈమె మాత్రం ఆ ఆఫర్‌కు నో చెప్పిందని, సరైన కారణం చెప్పకుండానే సమంత ఆ చిత్రానికి నో చెప్పిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సమంత సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి.

సమంత గత కొన్నాళ్లుగా వరుసగా చిత్రాలు చేస్తూ ఉంది. పెళ్లి తర్వాత కూడా ఈమె పలు చిత్రాల్లో నటించింది. ఈమె వరుసగా నాలుగు చిత్రాలతో సూపర్‌ హిట్స్‌ను దక్కించుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో ‘యూటర్న్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇప్పటికే కమిట్‌ అయిన చిత్రాలను పూర్తి చేసి ఈమె సినిమాలకు బ్రేక్‌ తీసుకోబోతుందని, లేదంటే ఈమె సినిమాలకు పూర్తిగా దూరం కాబోతుంది అంటూ వస్తున్న వార్తలపై తాజాగా నాగచైతన్య స్పందించాడు.

నాగచైతన్య మాట్లాడుతూ.. సమంతకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆమె సినిమాలకు దూరం అవ్వాలని కోరుకోవడం లేదు. ఆమె సినిమాలకు దూరంగా ఉండాలని తాను కోరుకోవడం లేదు అంటూ చైతూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సమంత సినిమాలకు దూరంగా ఏమీ లేదని, ప్రస్తుతం ఆమె రెండు మూడు చిత్రాలు చేస్తుందని చెప్పుకొచ్చాడు. ఏదైనా కారణం వల్ల సమంత బ్రేక్‌ తీసుకుంటే తీసుకుంటుందేమో కాని, సినిమాలకు పూర్తిగా మాత్రం దూరంగా ఉండదు అంటూ ఈ సందర్బంగా చైతన్య చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం సినిమాల్లో సమంత నటిస్తుందని, కొన్ని కారణాల వల్ల ఆమె బ్రేక్‌ తీసుకోబోతున్నట్లుగా చెబుతున్నారు. ఆమె ఏ కారణంగా బ్రేక్‌ తీసుకోబోతుందనే విషయమై చర్చ జరుగుతుంది. సమంతకు తల్లి కావాలనే కోరికగా ఉందని, అందుకే ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత సమంత తల్లి కావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ కారణం వల్లే సమంత సినిమాలకు చిన్న బ్రేక్‌ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సమంత తల్లి అయిన తర్వాత మళ్లీ ఎంట్రీ ఇస్తానంటే మాత్రం ఆమెను ప్రేక్షకులు ఆధరిస్తారా లేదా అనేది చూడాలి.