మజిలీతో మాయ చేస్తున్న భార్య భర్తలు! మరో ఏమాయ చేసావే అవుతుందా

అక్కినేని హీరో నాగ చైతన్య ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్నాడు.కెరియర్ లో సరైన ప్లానింగ్ లేకుండా సినిమాలు చేయడం వలన రొటీన్ సినిమాలకే పరిమితం అయిపోయిన చైతు ఆడియన్స్ పల్స్ ని అందుకోలేక చతికిలపడుతున్నాడు.

 Naga Chaitanya Get Back With Majili Movie-TeluguStop.com

అయితే ఈ సారి నిన్ను కోరే సినిమాతో క్లాసిక్ మూవీ తీసిన శివ నిర్వాణ దర్శకత్వంలో భార్య సమంతతో కలిసి మజిలీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అయ్యాడు .తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

స్టార్ హీరోయిన్ గా సమంత వరుస హిట్స్ తో దూసుకుపోతూ ఉంటే, మరో వైపు చైతు ఫ్లాప్ లతో సతమతమవుతూ ఉన్న టైంలో మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఏమాయ చేసావే తరహాలో ఎమోషనల్ ఫ్యామిలీ లవ్ స్టొరీని శివ తెరపై ఆవిష్కరించాడు.భర్తని విపరీతంగా ప్రేమించే భార్య తనకోసం ఏదైనా చేయడానికి రెడీ అయ్యే పాత్రలో సమంత, జీవితంలో ఆటలోను, ప్రేమలోను ఓడిపోయి మానసికంగా క్రుంగిపోయిన హీరో పాత్రలో చైతు ఈ సినిమాలో కనిపిస్తున్నారు అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది.

ఓ విధంగా చెప్పాలంటే ఇద్దరు భార్యాభర్తల ఎమోషనల్ ఫ్యామిలీ లవ్ స్టొరీగా దీనిని శివ ఆవిష్కరించాడు.మరి ఈ సినిమా చైతుకి ఎ మేరకు హిట్ ఇస్తుందో వేచి చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube