భార్య బాటలోనే నడవడానికి రెడీ అవుతున్న నాగ చైతన్య !

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఈ మధ్య విభిన్న కథలను ఎంచుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఆచితూచి అడుగులు వేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటున్నాడు.

 Naga Chaitanya Entry In Ott Platform-TeluguStop.com

హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.సమంత పెళ్ళికి ముందులాగా సినిమాలు చేయడం లేదు.

నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ హిట్స్ కొడుతోంది.

 Naga Chaitanya Entry In Ott Platform-భార్య బాటలోనే నడవడానికి రెడీ అవుతున్న నాగ చైతన్య -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కరోనా వచ్చిన దగ్గర నుండి ఓటిటీ లకు డిమాండ్ బాగా పెరిగింది.

హీరో, హీరోయిన్స్ కూడా ఓటిటీ వైపు అడుగులు వేస్తున్నారు.ప్రేక్షకులు కూడా థియేటర్స్ కు వెళ్లి సినిమా చూసే ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

ఎక్కువగా ఓటిటీ లలోనే సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నాడు.ఓటిటీ లు కూడా ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

అయితే సమంత కూడా ఈ మధ్యనే డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి అడుగు పెట్టింది.

Telugu Amazon Prime, Love Story, Naga Chaitanya, Naga Chaitanya Entry In Ott Platform, Naga Chaitanya In Digital Platform, Naga Chaitanya In Web Series, Ott Platform, Samantha Aha Talk Show, Samantha Akkineni, Thank Yoou Movie, The Family Man 2-Movie

ఆహా టాక్ షో లో సమంత హోస్ట్ గా చేసి ప్రేక్షకులను మెప్పించింది.అంతేకాదు త్వరలోనే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో విలన్ గా కనిపించబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.అయితే ఇప్పుడు సమంత భర్త నాగ చైతన్య కూడా భార్య బాటలోనే నడవడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

నాగ చైతన్య ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం చేసుకున్నాడని ఈ వార్తల సారాంశం.

అటువైపు వరసపెట్టి సినిమాలు చేస్తూనే ఇటు ఓటిటీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడని తెలుస్తుంది.

అయితే అది తెలుగు వెబ్ సిరీస్ నా లేదంటే హిందీ వెబ్ సిరీస్ నా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.ఇది ఇలా ఉండగా నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లవ్ స్టోరీ సినిమా పూర్తి చేసి విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్నాడు.

#NagaChaitanya #NagaChaitanya #OTT Platform #Love Story #Amazon Prime

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు