డిజిటల్ ఎంట్రీకి రెడీ అయిన నాగ చైతన్య... అమెజాన్ తో భారీ డీల్

సౌత్ లో సీనియర్ హీరోయిన్స్ అందరూ ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ లు చేసుకుంటున్నారు.అక్కడ తమ కెరియర్ ప్లానింగ్ తో ముందుకి వెళ్ళిపోతున్నారు.

 Naga Chaitanya Digital Entry With Amazon Prime-TeluguStop.com

కాజల్, తమన్నా, ప్రియమణి, సమంత, త్రిష లాంటి అందాల భామలు అందరూ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు.ఇక సాయి పల్లవి కూడా గౌతమ్ మీనన్ వెబ్ సిరీస్ లో నటించి డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది.

ప్రస్తుతం ఉన్న సెకండ్ కేటగిరీలో ఉన్న అందాల భామలు కూడా డిజిటల్ లో భవిష్యత్తు వెతుక్కుంటున్నారు.వారికి సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

 Naga Chaitanya Digital Entry With Amazon Prime-డిజిటల్ ఎంట్రీకి రెడీ అయిన నాగ చైతన్య… అమెజాన్ తో భారీ డీల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరిలో తెలుగమ్మాయిలు కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి తాను రెడీ అనే విషయాన్ని కింగ్ నాగార్జున ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు.

కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడంలో ముందుండే నాగార్జున డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ఈ మధ్య సినిమాలు చేస్తూ కొత్త దర్శకులకి ఛాన్స్ ఇస్తున్నాడు.ఇక వెబ్ సిరీస్ లలో మరింత కొత్త కాన్సెప్ట్ లు వస్తాయని వాటికి రెడీ అన్నాడు.

అయితే నాగార్జున కంటే ముందుగా అతని వారసుడు నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ ఖరారు చేసుకున్నాడని తెలుస్తుంది.లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతున్న నాగ చైతన్య కూడా రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.

అతనితో సౌత్ లో ఓ క్రేజీ వెబ్ సిరీస్ ని అమెజాన్ ప్లాన్ చేస్తుందని సమాచారం.ఇప్పటికే చైతన్య భార్య సమంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది.

ఇక ఇప్పుడు చైతూ కూడా ఈ రూట్ లోకి వచ్చేశాడు.నాగార్జున కూడా రావడానికి రెడీగా ఉన్నాడు.ఈ నేపధ్యంలో అక్కినేని ఫ్యామిలీ మొత్తం మిగిలిన టాలీవుడ్ సెలబ్రిటీలకి డిజిటల్ ఎంట్రీ కోసం రూట్ మ్యాప్ వేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.

#Naga Chaitanya #King Nagarjuna #Amazon Prime #The Family Men2 #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు