సమంత కోసం బాగా ఏడ్చిన నాగాచైతన్య     2016-12-22   22:59:45  IST  Raghu V

సినిమాల్లో హీరో కాని, హీరోయిన్ కాని చనిపోయే సన్నివేశాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు ఏడవడం చాలా కష్టమైన విషయమే. ఇదివరకు అలాంటి సన్నివేశాలు ఎన్నో చూడటం వలనో, మన దర్శకులు ఏడిపించేంత ఎమోషన్ పండించలేకపోవడం వలనో, కన్నీళ్ళు రావడం డౌటే.

కాని నాగచైతన్య ఏడ్చాడు. బాగా ఏడ్చాడట. అది ఒక హీరోయిన్ పాత్ర చనిపోవడం చూసి. వేరే హీరోయిన్ చనిపోతే చైతు మాత్రం ఎందుకు ఏడుస్తాడు. అక్కడ తెర మీద చనిపోయింది సమంత కాబట్టే ఏడ్చాడు.

తమిళ సినిమా తెరిలో సమంత పాత్ర చనిపోతుంది. ఆ సినిమా చూడడానికి సమంతతో కలిసి థియేటర్ కి వెళ్ళిన చైతన్య, ఆ సన్నివేశం రాగానే ఏడ్చేసాడట. ఈ విషయాన్ని సమంత స్వయంగా ఈమధ్యే బయటపెట్టింది. ఈ విషయాన్ని బట్టి తన ఫ్యూచర్ వైఫ్ సమంతని మన అక్కినేని అందగాడు ఎంత బాగా చూసుకుంటాడో అర్థం అయిపోతుంది కదా.