లవ్‌స్టోరిలో ఆమెదే పైచేయి.. పాపం చైతు!  

Naga Chaitanya Could Not Match Sai Pallavi Dance Steps - Telugu Dance Steps, Love Story, Naga Chaitaya, Sai Pallavi, Sekhar Kammula

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం లవ్‌స్టోరి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు.

 Naga Chaitanya Could Not Match Sai Pallavi Dance Steps

ఈ సినిమాతో మరోసారి ఫిదా తరహా విజయం అందుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.అయితే ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నాగచైతన్య కంటే సాయి పల్లవి పై చేయి చూపించిన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ సినిమాలోని సాంగ్స్‌ను షూట్ చేస్తున్న సందర్భంలో డ్యాన్స్ మాస్టర్లు చూపించిన డ్యాన్స్ స్టెప్పులను నాగ చైతన్య చాలా నెమ్మదిగా, ఆలస్యంగా చేసి చూపిస్తున్నాడట.ఈ స్టెప్పులు చేయడానిక ఆయన ఏకంగా 20 టేక్‌లు తీసుకుంటున్నాడట.

లవ్‌స్టోరిలో ఆమెదే పైచేయి.. పాపం చైతు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా హీరోయిన్ సాయి పల్లవి మాత్రం అలవోకగా ఈ డ్యాన్స్ స్టెప్పులు వేస్తుండటంతో చిత్ర యూనిట్ అవాక్కవుతున్నారు.డ్యాన్సర్ అయిన సాయి పల్లవికి డ్యాన్స్ పట్ల ఇలాంటి ఇష్టం ఉందని తమకు తెలియదని వారందరూ అంటున్నారు.

ఏదేమైనా స్టార్ ఫ్యామిలీకి చెందిన హీరో ఇలా హీరోయిన్ కంటే ఎక్కువ టేకులు తీసుకుని డ్యాన్స్ స్టెప్పులు వేస్తుండటంతో అందరూ సాయి పల్లవిని మెచ్చుకుంటున్నారు.ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test