ఒక్క ట్వీట్ తో రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన చైతూ!

మన టాలీవుడ్ తో పాటు మిగతా ఇండస్ట్రీల్లో కూడా ఈ మధ్య ఎక్కువుగా వినిపిస్తున్న పేర్లు సమంత నాగ చైతన్య వీరి గురించి ప్రజలు ఎక్కువుగా మాట్లాడు కుంటున్నారు.అందుకు కారణం కూడా వాళ్లే అని చెప్పాలి.

 Naga Chaitanya Clarity About Rumors-TeluguStop.com

ఎందుకంటే వారి మధ్య ఏదో మనస్పర్థలు వచ్చాయనేలా ప్రవర్తించింది సామ్.మొదటగా సమంత తన సోషల్ మీడియాలో ఖాతాలో ఉన్న అక్కినేని పేరును తొలగించి S అనే లెటర్ పెట్టడంతో రచ్చ స్టార్ట్ అయ్యింది.

ఈ పేరు చేంజ్ చేసిన దగ్గర నుండి ఇండస్ట్రీ మొత్తం వీళ్ళ గురించి చర్చించు కుంటున్నారు.వీళ్లిద్దరి మధ్య మస్పర్దలు రావడం వల్లనే సామ్ తన పేరును మార్చుకుందంటూ వార్తలు వచ్చాయి.

 Naga Chaitanya Clarity About Rumors-ఒక్క ట్వీట్ తో రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన చైతూ-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలో సమంత కూడా ఈ విషయంపై మాట్లాడడానికి అంగీకరించలేదు.అటు చైతు కూడా ఈ వార్తలు ఖండించలేదు.

అందుకే వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వైరల్ అయ్యాయి.

ఇక తాజాగా సామ్ చేసిన పని వల్ల మళ్ళీ ఈ విషయం వెలుగులోకి వచ్చింది.లవ్ స్టోరీ ట్రైలర్ విడుదల అయినా సందర్భంగా ఈ ట్రైలర్ పై సమంత స్పందించింది.అయితే ఎప్పటిలా కాకుండా సమంత ఈ ట్రైలర్ షేర్ చేస్తూ కేవలం సాయి పల్లవి ని మాత్రమే టాగ్ చేస్తూ విన్నర్ అని ట్వీట్ చేసింది.

దీంతో ఈ రచ్చ మళ్ళీ మొదలయ్యింది.నాగ చైతన్య పేరు ప్రస్తావించక పోవడం వల్ల వీళ్ళు నిజంగానే గొడవ పడ్డారా అని అభిమానులు ఆందోళన చెందారు.

కానీ మళ్ళీ వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ నాగ చైతన్య ఒక ట్వీట్ చేసాడు.ఒక్క ట్వీట్ తో అందరి అనుమానాలపై ఒక క్లారిటీ ఇచ్చేసాడు.సమంత చేసిన పోస్ట్ కు నాగ చైతన్య థాంక్స్ సామ్ అంటూ ట్వీట్ చేసాడు.దీంతో అక్కినేని అభిమానులు సామ్ చైతన్య విడిపోవడం లేదంటూ ఆనంద పడుతున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

https://twitter.com/chay_akkineni/status/1437631042307846147?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1437631042307846147%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fnaga-chaitanya-reply-to-samantha%2F
#Naga Chaitanya #Rumors #Tweet #NagaChaitanya #Love Story

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు