'మజిలీ'తో డబుల్‌ దక్కించుకున్న నాగచైతన్య, సమంత  

Naga Chaitanya And Samantha Remuneration For Majili Movie-naga Chaitanya And Samantha,rs 10 Crore

అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా చాలా కాలంగా కమర్షియల్‌ బిగ్‌ సక్సెస్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని ఆయన మాత్రం ఇప్పటి వరకు రెండు మూడు సినిమాలు తప్ప పెద్దగా సక్సెస్‌లు అయితే దక్కించుకోలేక పోయాడు. కమర్షియల్‌ బ్రేక్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చిన ఆఫర్లన్నింటికి ఓకే చెబుతున్న నాగచైతన్య పారితోషికం నాలుగు అయిదు కోట్లకు అటు ఇటుగా ఉండేది...

'మజిలీ'తో డబుల్‌ దక్కించుకున్న నాగచైతన్య, సమంత-Naga Chaitanya And Samantha Remuneration For Majili Movie

ఇక సమంత స్టార్‌ హీరో సినిమా లేదా మరీ ముఖ్యమైన సినిమా అయితే రెండు కోట్లు లేదంటే కోటి, కోటిన్నర వరకు రెమ్యూనరేషన్‌ తీసుకునేది.

నాగచైతన్య, సమంత కలిసి నటించినందుకు ఏకంగా 10 కోట్ల పారితోషికం అందుకున్నట్లుగా తెలుస్తోంది. ‘మజిలీ’ చిత్రం కోసం నిర్మాతలు ఈ జంటకు జాయింట్‌గా 10 కోట్ల రూపాయల పారితోషికంను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీరి పారితోషికంతో పాటు మరో పది కోట్ల రూపాయలతో మొత్తం 20 కోట్లతో సినిమాను పూర్తి చేశారు. అయితే సినిమాకున్న క్రేజ్‌ నేపథ్యంలో భారీ ఎత్తున అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్‌ చేసింది. శాటిలైట్‌ రైట్స్‌ మరియు అమెజాన్‌ ప్రైమ్‌ రైట్స్‌ కూడా భారీగా రావడంతో నాగచైతన్య, సమంతల జంటకు ఏ స్థాయి క్రేజ్‌ ఉందో చెప్పకనే చెప్పొచ్చు.

పెళ్లి తర్వాత నాగచైతన్య మరియు సమంత కలిసి నటిస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని దర్శకుడు శివ నిర్వాన టీజర్‌లో చెప్పకనే చెప్పాడు. ఆయన తీసిన నిన్నుకోరి చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తరహాలోనే ఈ చిత్రం కూడా తప్పకుండా మంచి కమర్షియల్‌ సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతో అక్కినేని ఫ్యాన్స్‌ ఉన్నారు.

మజిలీ చిత్రం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.