2022 జనవరి వరకు చైతూ సామ్ లు భార్య భర్తలే

టాలీవుడ్‌ క్యూట్‌ అండ్‌ బ్యూటీ ఫుల్ కపుల్‌ నాగ చైతన్య మరియు సమంతలు విడిపోతున్నట్లుగా ప్రకటించారు.వారి ప్రకటన అభిమానులకు గుండెలు బద్దలు అయ్యేలా చేసింది అనడంలో సందేహం లేదు.

 Naga Chaitanya And Samantha Divorce Next Year-TeluguStop.com

ప్రతి ఒక్కరు కూడా వారిద్దరు విడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చిన సమయంలో వద్దనుకున్న వారే ఉన్నారు.కాని ఎవరు వద్దనుకున్నా కూడా వారిద్దరి విడాకులు మాత్రం ఆగలేదు.

ఇద్దరు కూడా విడి పోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో అభిమానులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.మరి కొందరు ఏకంగా కన్నీరు పెట్టుకున్నారు.

 Naga Chaitanya And Samantha Divorce Next Year-2022 జనవరి వరకు చైతూ సామ్ లు భార్య భర్తలే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతగా అభిమానులు వారిని కలిపి అభిమానిస్తున్నారు.అలాంటి నాగ చైతన్య మరియు సమంతలు ప్రస్తుతం విడి విడిగానే ఉంటున్నారు.

చైతూ హైదరాబాద్‌ లోని ఒక హోటల్‌ లో ఉంటుండగా సమంత ప్రస్తుతం చెన్నైలో ఉంది.వీరిద్దరు ప్రస్తుతం విడిగా ఉంటున్నా కూడా అధికారికంగా మాత్రం వీరు ఇంకా విడి పోలేదు.

Telugu Chaisam, Film News, Naga Chaitanya, Samantha-Movie

అక్కినేని కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరు ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేయడం జరిగింది.ఇద్దరు కూడా తమ ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లుగా కోర్టుకు తెలియజేశారు.అయితే కోర్టు రూల్స్ ప్రకారం వారికి రెండు లేదా మూడు సార్లు కలిపి మరియు విడి విడిగా కౌన్సిలింగ్ చేస్తారు.ఆ సమయంలో వారు ఏమైనా తమ నిర్ణయాన్ని మార్చుకుంటారా అనేది కోర్టు నమ్మకం.

కాని కోర్టు సూచన మేరకు కౌన్సిలింగ్‌ అనేది జరగడం చాలా అరుదుగా జరుగుతుంది.సెలబ్రెటీలు ఆ కౌన్సిలింగ్ కు వెళ్తారా లేదా అనేది కూడా తెలియదు.ఇక కోర్టు వీరి జంటకు వచ్చే ఏడాది జనవరిలో విడాకులు మంజూరు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జనవరిలో చైతూ మరియు సమంతలు తమ విడాకుల ప్రకటన మరోసారి చేస్తారని తెలుస్తోంది.

మొత్తానికి ఈ మొత్తం వ్యవహారం కాస్త ఇబ్బందిగా ఉన్నా అభిమానులు జీర్ణించుకోక తప్పదు.

#Samantha #Chaisam #Naga Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు