సాయి పల్లవి లవ్‌ స్టోరీతో నాగ చైతన్య అభిమానులు అసంతృప్తి

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్‌ స్టోరీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

 Naga Chaitanya And Sai Pallavi Love Story Movie Promotions , Naga Chaitanya, Sai-TeluguStop.com

ఈ సినిమా నుండి విడుదల అవుతున్న ఒక్కో పాట సినిమా పై ఆసక్తిని పెంచడంతో పాటు మరో వైపు సినిమా విషయంలో నాగచైతన్య అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసేలా చేస్తున్నాడు.ప్రస్తుతం సినిమా షూటింగ్‌ పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్న యూనిట్‌ సభ్యులు సాయి పల్లవికి ప్రముఖంగా ప్రాముఖ్యత ఇస్తున్నారు.

సాయి పల్లవి డాన్స్ లు ఈ సినిమా లో మరో లెవల్‌ లో ఉంటాయనే టాక్ వినిపిస్తుంది.ప్రముఖ డాన్స్ మాస్టర్‌ శేఖర్‌ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డాన్స్ లు చేయిస్తున్నాడు.

ఈ డాన్స్ ల విషయంలో సాయి పల్లవి ఖచ్చితంగా చైతూను డామినేట్‌చేసే విధంగా ఉందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అక్కినేని అభిమానులు మరియు కొందరు ప్రేక్షకులు అంటున్న దాని ప్రకారం లవ్‌ స్టోరీ సినిమా లో నాగచైతన్య మరియు సాయి పల్లవిల జోడీ చూస్తుంటే కాస్త నిరుత్సాహంగా ఉందని కూడా అంటున్నారు.

పెద్ద మొత్తంలో సినిమా పై అంచనాలు పెంచేందుకు గాను సాయి పల్లవిని ప్రమోట్ చేయడంతో పాటు చైతూ లుక్‌ విషయంలో కూడా కాస్త విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.సాయి పల్లవితో పోల్చితే చైతూ లుక్‌ మరీ డల్‌ గా ఉంది.

ఇప్పటి వరకు విడుదల అయిన పోస్టర్స్ మరియు వీడియోల్లో నాగచైతన్య మరీ సన్నగా అమాయకంగా కనిపిస్తున్నాడు అంటున్నారు.ఇలా అయితే చైతూ నుండి అభిమానులు ఏం కోరుకుంటున్నారో అది దక్కడం కష్టం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి సాయి పల్లవి ని లవ్‌ స్టోరీ విషయంలో కాస్త తగ్గించాలంటూ అక్కినేని అభిమానుల నుండి సున్నితంగా హెచ్చరికలు వస్తున్నాయంటున్నారు.కాని సాయి పల్లవి అభిమానులు మాత్రం లవ్‌ స్టోరీ సినిమా లో ఆమె ప్రాముఖ్యత నేపథ్యంలో ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube