వెంకీ మామ రిజెక్ట్ చేసిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లుడు చైతూ.. అంతగా నచ్చిందా!

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా కొన్ని కథలను కొందరు హీరోలు తిరస్కరిస్తే ఆ కథ నచ్చడంతో సినిమాలు చేస్తున్నారు.ఇలా ఆ హీరో వదులుకున్న సినిమాలు విజయవంతం అయితే ఆ తరువాత సినిమాలను వదులుకున్న హీరోలు ఎంతో పశ్చాత్తాప పడిన సందర్భాలు చాలా ఉన్నాయి.

 Naga Chaitanya Accepted That Rejected By Venkatesh Naga Chaitanya, Venkatesh, Tollywood, Tharun Bhaskar, Bangarraju, Thank You Movie-TeluguStop.com

తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ తో దగ్గుబాటి వెంకటేష్ దగ్గరికి వెళ్ళారు.కథ మొత్తం విన్న వెంకీ మామ కథ నచ్చక పోవడంతోనో లేదా ఇతర కారణాలతోనో ఈ సినిమాను తిరస్కరించారు.

దీంతో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అదే స్క్రిప్ట్ తో అల్లుడు నాగచైతన్య దగ్గరకు వెళ్లారు.అయితే ఈ కథ నాగచైతన్యకు బాగా నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం వినబడుతుంది.

 Naga Chaitanya Accepted That Rejected By Venkatesh Naga Chaitanya, Venkatesh, Tollywood, Tharun Bhaskar, Bangarraju, Thank You Movie-వెంకీ మామ రిజెక్ట్ చేసిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లుడు చైతూ.. అంతగా నచ్చిందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా మామ వద్దన్న కథకు అల్లుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.అయితే ఈ సినిమా ఏంటి అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ఇక నాగచైతన్య విషయానికి వస్తే బంగార్రాజు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న థాంక్యూ చిత్రంలో నటిస్తున్నారు.ఇందులో అవికాగోర్ రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా రష్యాలో షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఇదే కాకుండా అమీర్ ఖాన్ తో పాటు నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా, అదేవిధంగా మరొక వెబ్ సిరీస్ లో నెగిటివ్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Naga Chaitanya Accepted That Rejected By Venkatesh Naga Chaitanya, Venkatesh, Tollywood, Tharun Bhaskar, Bangarraju, Thank You Movie - Telugu Bangarraju, Naga Chaitanya, Tharun Bhaskar, Tollywood, Venkatesh #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube